ముఖం పైన వెంట్రుకలకు బియ్యంపిండి పేస్ ప్యాక్ తో చెక్

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 12:57 PM

ముఖం పైన వెంట్రుకలకు బియ్యంపిండి పేస్  ప్యాక్ తో చెక్

ముఖం అందంగా కనిపించినప్పటికీ కొంత మందికి ముఖంపైన వెంట్రుకలు కనబడుతుంటాయి దీని వలన ఎక్కడికైనా ఫంక్షన్స్ కి వెళ్లినప్పుడు ఇబ్బంది పడుతూ ఉంటారు . దాని కోసము పార్లర్ కి వెళ్లి ముఖం పైన పెరిగిన వెంట్రుకలను తొలగించుకోవడానికి , , వ్యాక్సింగ్ వంటివి ట్రై చేస్తారు. అయితే, వీటిని వాడడం వల్ల స్కిన్ ఇరిటేషన్ వస్తుంది. దీంతో నొప్పి ఇబ్బందిగా ఉంటుంది.అందువలన మన ఇంట్లో దొరికే వస్తువులను ఉపయోగించుకొని ఈ సమస్యని దూరం చేసుకోవచ్చు . ఇప్పుడు దాని కోసం ఏమి చేయాలి చూదాం .

బియ్యంపిండి, పసుపు, నిమ్మరసం
బియ్యంపిండి మంచి స్క్రబ్. అది సహజంగానే ఎన్నో చర్మ సమస్యల్ని దూరం చేస్తుంది. ఇందులోని విటమిన్స్, పోషకాలు చర్మానికి మేలు చేస్తాయి. కావున బియ్యం పిండితో ఫేస్ మాస్క్‌ని తయారు చేయొచ్చు. దీని వల్ల చర్మంపై ఉన్న మృతకణాలు తొలగి ముఖంపై ఉండే వెంట్రుకలు దూరమవుతాయి.ఇవేకాకుండా మన వంట గదిలో ఉపయోగించుకొనే పసుపును కూడా హెయిర్ రిమూవల్‌ చేయడానికి యూజ్ చేస్తారు . ఇందులో బ్లీచింగ్ గుణాలు కూడా ఉంటాయి. దీనిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఉండడం వలన చర్మంపై ఉన్న గాయాలు, మచ్చల్ని దూరం చేస్తాయి. అంతేకాకుండా వెంట్రుకలని దూరం చేస్తాయి. కాబట్టి, దీనిని చాలా మంది ఫేస్‌ప్యాక్స్‌లో వాడతారు.ఇదే మాదిరిగా నిమ్మరసంలో కూడా బ్లీచింగ్ గుణాలు ఉంటాయి. ఇది ముఖంపై ఉండే వెంట్రుకలని దూరం చేస్తుంది. నిమ్మరసంలోని సిట్రిక్ యాసిడ్ చర్మానికి మేలు చేస్తుంది. ఇందులోని విటమిన్స్ కారణంగా దీనిని చాలా ఫేస్‌ప్యాక్స్‌లో వాడతారు.

ఎలా తయారు చేయాలి.
ముందుగా ఇందుకోసం ఓ గిన్నెలో కొద్దిగా బియ్యంపిండి, మరికొద్దిగా పసుపు, నిమ్మరసం వేసి పేస్ట్‌లా కలుపుతారు. కావాలంటే కొద్దిగా రోజ్‌వాటర్ కూడా వేయండి. దీనిని ప్యాక్‌లా చేసి ముఖానికి రాస్తారు. తర్వాత నెమ్మదిగా మసాజ్ చేయండి. ఆరిపోయిన తర్వాత క్లీన్ చేయండి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మంచిది.ఇలా చేయడం వలన మన ముఖంపైన ఉన్న వెంట్రుకలు తొలిగిపోయి ముఖం అందంగా , కాంతివంతంగా , కనపడుతుంది .






Untitled Document
Advertisements