నష్టాల్లో మొదలై.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 04:34 PM

నష్టాల్లో మొదలై.. లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేటి ఉదయం నష్టాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు లాభాల్లో ముగిశాయి. నష్టాల్లో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే లాభాల్లోకి మళ్లాయి. ఆ తర్వాత చివరి వరకు లాభాల్లోనే కొనసాగాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 191 పాయింట్లు లాభపడి 72,832కి పెరిగింది. నిఫ్టీ 85 పాయింట్లు పుంజుకుని 22,097 వద్ద స్థిరపడింది. టెక్, ఐటీ సూచీలు మినహా అన్ని సూచీలు లాభాలను మూటకట్టుకున్నాయి. మరోవైపు డాలరుతో రూపాయి మారకం విలువ మరో 34 పైసలు క్షీణించింది. ప్రస్తుతం మన రూపాయి విలువ రూ. 83.47గా ఉంది.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
మారుతి (3.55%), సన్ ఫార్మా (2.77%), టైటాన్ (2.21%), ఐటీసీ (1.71%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (1.70%).

టాప్ లూజర్స్:
ఇన్ఫోసిస్ (-2.98%), విప్రో (-2.73%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (-2.46%), టీసీఎస్ (-1.53%), టెక్ మహీంద్రా (-1.33%).





Untitled Document
Advertisements