దసరా కానుకగా చై, సాయి పల్లవి మూవీ తండేల్.. శరవేగంగా షూటింగ్ పనులు

     Written by : smtv Desk | Fri, Mar 22, 2024, 04:55 PM

దసరా కానుకగా చై, సాయి పల్లవి మూవీ తండేల్.. శరవేగంగా షూటింగ్ పనులు

టాలీవుడ్ లో మంచి పేరు సంపాదించిన అక్కినేని ఫ్యా మిలీ లో ఒకరైన యువ సామ్రాట్ అక్కినేని నాగ చైతన్య, మొదటి సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ నిలిచాడు . ప్రస్తుతం నాగ చైతన్య , నేచురల్ బ్యూటీ సాయి పల్లవి హీరోహీరోయిన్లుగా తండేల్ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ పరంగా ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి సముద్ర వేటకు వెళ్ళి అనుకోని పరిస్థితుల్లో పాకిస్థాన్ అధికారులకు చిక్కిన మత్స్యకారుల జీవితాల ఆధారంగా ఈ మూవీ తెరకెక్కుతోంది. నాగ చైతన్య మత్స్యకారుడి రోల్ లో కనిపించనుండగా సాయి పల్లవి పల్లెటూరి అమ్మాయి పాత్రలో నటిస్తోంది.
ఇప్పటికే ఈ సినిమాపై మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల గ్లింప్స్ రిలీజ్ అయ్యాక.. అంచనాలు పెరిగిపోయాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో శరవేగంగా జరుగుతోంది. మూవీలోని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు మేకర్స్. గీతా ఆర్ట్స్ పతాకంపై బన్నీ వాసు నిర్మాతగా, అల్లు అరవింద్ సగర్వంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని చందూ మొండేటి ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్నారు.
ఇప్పటికే ఒకసారి వర్కింగ్ స్టిల్స్ రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా మరోసారి విడుదల చేశారు. పిక్స్ చూస్తుంటే సెట్స్ లో ఫ్రెండ్లీ వాతావరణం ఉన్నట్లు అనిపిస్తుంది. ఇంకో ఫోటోలో తీయబోయే సీన్స్ గురించి చందూ వివరిస్తుంటే సాయి పల్లవి సీరియస్ గా రాసుకుంటుంది. మరో వర్కింగ్ స్టిల్ లో సాయి పల్లవి ఓ మహిళ పక్కన కూర్చుని ఒడిలో పాప పట్టుకుని నవ్వుతూ కనిపిస్తోంది. ప్రస్తుతం సాయి పల్లవి పిక్స్ నెట్టింట ఫుల్ వైరల్ అవుతున్నాయి. ఎంత అందంగా నవ్వుతున్నారో అంటూ ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. అచ్చ పల్లెటూరి అమ్మాయి రోల్ లో సాయి పల్లవి ఒదిగి పోయిందని అంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లో పాకిస్థాన్ సెట్ వేసి షూట్ చేస్తున్నారు మేకర్స్. త్వరలో మూవీ నుంచి క్రేజీ అప్డేట్స్ వస్తాయని ప్రకటించారు. నటీనటుల గెటప్స్, కాస్ట్యూమ్స్, బాడీ లాంగ్వేజ్, యాసలతో సహా ప్రతిదీ పర్ఫెక్ట్‌ గా కనిపించేలా చూసుకుంటున్నారట చందూ మొండేటి. మరికొద్ది రోజుల్లో గ్లింప్స్ రిలీజ్ చేస్తారని సినీ ఇండస్ట్రీలో జోరుగా ప్రచారం సాగుతోంది. దసరా కానుకగా ఈ చిత్రం థియేటర్లలోకి రాబోతున్నట్లు తెలుస్తోంది. చాల రోజుల నుండి నాగ చైతన్య కు హిట్స్ లేవు కనీసం ఈ సినిమా ను అయినా ప్రేక్షకులు ఆదారిస్తారో చూడాలి మరి.








Untitled Document
Advertisements