శని త్రయోదశి నాడు ఇలా చేస్తే జరిగేది ఇదే!

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 10:11 AM

శని త్రయోదశి నాడు ఇలా చేస్తే జరిగేది ఇదే!

సనాతన ధర్మంలో మానవులకు ఏమైనా చెడు జరిగితే చాలు శని పట్టింది అని అంటుంటారు . అప్పుడు శని దేవుడికి ఇష్టమైన రోజు పూజలు చేయాలి . శని దేవుడికి పూజలు చేయడం వలన తాను శాంతిస్తాడు అని మన కోరికలు తీరుస్తాడు అని నమ్మకం అయితే శని త్రయోదశి రోజున శనీశ్వరునికి ఇష్టమైన నువ్వుల నూనె అభిషేకం చేసి (తైలాభిషేకం) నల్లని వస్త్రాన్ని సమర్పించడం ద్వారా నవగ్రహాల అనుగ్రహం లభించడమే గాక శనీశ్వరుడి కృపకు పాత్రులవుతారని చెబుతున్నారు.ముఖ్యంగా శని త్రయోదశి రోజున శనీశ్వరునికి తైలాభిషేకం చేసిన తర్వాత బ్రాహ్మణులకు నువ్వులు దానం చేయడం ద్వారా.. నవగ్రహాల దోషాలు తొలగుతాయని . అలాగే శని త్రయోదశి రోజున ఉపవాసం ఉండడం శ్రేయస్కరమని, శనీశ్వరుని గ్రహ పీడ నుంచి విముక్తి పొందవచ్చునని

శని త్రయోదశి అనేది శనీశ్వరునికి అత్యంత ప్రీతికరమైన రోజు అని ఆ రోజున ఎవరైతే శనీశ్వరునికి ఇష్టమైన నువ్వుల నూనె.. తైలాభిషేకం చేసి 9 ప్రదక్షిణాలు చేసి శని భగవానునికి నల్లని వస్త్రాన్ని సమర్పించడం ద్వారా శనీశ్వరుని నుంచి విముక్తి పొందవచ్చునని చెబుతున్నారు పండితులు .
శని త్రయోదశి నాడు తైలంతో స్నానం ఎందుకు చేయాలి?
నవగ్రహాల దోషాలు, నవగ్రహాల పీడల నుంచి విముక్తి పొందాలంటే శని త్రయోదశి రోజున భక్తులందరూ విధిగా నువ్వులతో కూడిన తైలాన్ని శనీశ్వరునికి అభిషేకం చేయాలని, తద్వారా శని భగవానుని కరుణాకటాక్షాలు పొందవచ్చు కావున ఈ సంవత్సరం లో . శని త్రయోదశి ఈనెల 23వ తేదీ అనగా శనివారం రోజున ఉన్నది . కావున ప్రతి ఒక్కరు శని దేవుడికి తైలాన్ని సమర్పించి ఆ దేవుడిని సంతోషపెట్టి ఆయన అనుగ్రహహానికి పాత్రులుకాగలరు అంతేకాకుండా శని దేవుడి కృప ఉంటే ఎలాంటి ప్రాబ్లెమ్ అయినా చిటికలో తొలిగిపోతుంది .






Untitled Document
Advertisements