పీఎం కిసాన్ యోజన 17వ విడత పథకానికి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 11:13 AM

పీఎం కిసాన్ యోజన 17వ విడత పథకానికి సంబంధించి వైరల్ అవుతున్న న్యూస్ ఇదే!

ప్రధానమంత్రి నరేంధ్రమోడీ గారు పీఎం కిసాన్ యోజన పథకంప్రవేశపెట్టారు. దీని వలన దేశంలోని రైతులు లబ్ది పొందుతున్నారు. ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఆర్ధిక భరోసా కల్పిస్తున్నారు. 2019 ఫిబ్రవరిలో ఈ పథకాన్ని అమలులోకి తీసుకొచ్చి అప్పటినుంచి రైతులకు పంట సాయంగా సంవత్సరానికి 6 వేల రూపాయలు ఇస్తున్నారు. ఈ 6 వేల రూపాయలను మొత్తం మూడు విడతలుగా రైతుల అకౌంట్స్ లో జమ చేస్తూ వస్తోంది కేంద్ర ప్రభుత్వం. ఏప్రిల్- జులై, ఆగస్టు నవంబర్, డిసెంబర్-మార్చి సమయంలో ప్రతి విడతలో ఎకరానికి 2 వేల చొప్పున కేంద్రం ఈ ఆర్థిక సాయం అందిస్తోంది.

రీసెంట్ గానే పీఎం కిసాన్ 16వ విడత నిధులు కూడా రిలీజ్ చేశారు ప్రధాని మోదీ. ఫిబ్రవరి 28వ తేదీన రైతుల ఖాతాల్లోకి ఈ డబ్బు జమ అయింది. ఈ పథకంలో భాగంగా మొత్తం 9 కోట్ల మంది రైతులకు లబ్ధి చేకూరినట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. విడుదల చేసిన అమౌంట్ రూ.21,000 కోట్ల పైనే. షెడ్యూల్ ప్రకారం ప్రతి నాలుగు నెలలకు ఒకసారి పీఎం కిసాన్ నిధులు విడుదల చేస్తుంటారు. దీంతో ఇప్పుడు రైతుల దృష్టి మొత్తం 17వ విడత నిధులపై పడింది. ఈ ఫండ్ ఎప్పుడు వస్తుందనే దానిపై చర్చలు మొదలయ్యాయి.
పీఎం కిసాన్ నిధులు రిలీజ్ చేసేది నాలుగు నెలలకు ఓసారి. అంటే ఫిబ్రవరి నుంచి చూసుకుంటే జూన్ నెలలో 17వ విడత విడుదల కావాలి. కానీ ప్రస్తుతం ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న కారణంగా ఈ సారి పీఎం కిసాన్ వాయిదా చెల్లింపు చాలా ఆలస్యం కావొచ్చని తెలుస్తోంది. పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాలేదంటే అలెర్ట్ అయి ఫిర్యాదు చేయవచ్చు. అదేవిధంగా ప్రభుత్వం ఇస్తున్న ఈ పీఎం కిసాన్ యోజన డబ్బు అందుకోవాలంటే రైతులు ఖచ్చితంగా పూర్తి చేయాల్సిన ముఖ్యమైన పని ఈ- కేవైసీ. ఇది పూర్తి చేసిన వారికే పీఎం కిసాన్ అమౌంట్ ఖాతాలో పడుతుంది.ఆన్ లైన్ విధానంలో మీ ఈ- కెవైసీ పూర్తి చేయాల్సి ఉంటుంది. అంతేకాదు మీ బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేయాలి. ఈ రెండు పనులు చేయకపోతే పీఎం కిసాన్ 16వ విడత డబ్బు జమ కాదు. కాబట్టి వెంటనే ఈ- కెవైసీ పూర్తి చేయండి.
PM Kisan E- KYC కోసం పీఎం కిసాన్ అధికారిక పోర్టల్‌ pmkisan.gov.in లోకి వెళ్లి.. ఫార్మర్స్ కార్నర్‌లో ఉన్న న్యూ ఫార్మర్ రిజిస్ట్రేషన్‌పై క్లిక్ చేయండి. అక్కడ మీ ఆధార్ నంబర్, ఫోన్ నంబర్‌, భూమికి సంబంధించిన వివరాలతో పూర్తి సమాచారం ఎంటర్ చేయండి.
అనంతరం గెట్ ఓటీపీపై క్లిక్ చేస్తే.. అప్పుడు మీ మొబైల్ నెంబర్ కి వచ్చిన ఓటీపీ ఎంటర్ చేసి రిజిస్ట్రేషన్ కోసం ప్రొసీడ్ కావాలి. బ్యాంక్ అకౌంట్ వివరాలు సరిగ్గా ఎంటర్ చేయాలి. అలాగే మీ వ్యక్తిగత వివరాలు ఆధార్‌లో ఉన్నట్లుగా తప్పులు లేకుండా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత సబ్మిట్ చేస్తే సరిపోతుంది. ఆధార్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుంది. ఈ విధంగా మోడీ గారు చేపట్టిన పథకం సన్న కారు రైతులకు మంచిగా ఉపయోగపడుతుంది.






Untitled Document
Advertisements