ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం నాడు లక్ష్మీ కటాక్షము కొరకు ఇలా చేయండి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 12:16 PM

ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం నాడు లక్ష్మీ కటాక్షము కొరకు ఇలా చేయండి

హిందువులు లక్ష్మి దేవిని అమ్మవారిగా కొలుస్తారు . లక్ష్మి దేవి అంటే సిరి సంపదలకు, ముఖ్యమైనదిగా పరిగణిస్తారు . అంతేకాకుండా అమావాస్య , పౌర్ణమి కూడా చాలా ముఖ్యమైనవిగా పరిగణిస్తారు. అందులోనూ ఫాల్గుణ పౌర్ణమి మరింత ప్రత్యేకమైనది. ఎందుకంటే ఇది హిందూ సంవత్సరంలో వచ్చే చివరి పౌర్ణమి. ఆరోజే సంపదలకు అది దేవత అయిన లక్ష్మీదేవి జయంతి కూడా జరుపుతారు. అందుకే ఫాల్గుణ పౌర్ణమిని సంవత్సరంలోనే అదృష్టమైన రోజుగా పరిగణిస్తారు. పౌర్ణమి రోజు చేసే పూజలకు, దానాలకు అత్యంత ప్రాముఖ్యత ఉంటుంది.


హోలికా దహన్:
ఫాల్గుణ పౌర్ణమి రోజు హోలికా దహనము కూడా నిర్వహిస్తారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా ఇది జరుపుకుంటారు. పవిత్ర నదులలో స్నానం చేసి ఆచారాల ప్రకారం హోలికా దహనం చేస్తారు. ఇలా చేయడం వల్ల జీవితంలోని సమస్యలన్నీ హోలికా దాహనంలోని మంటల్లో ఆహుతి అవుతాయని నమ్ముతారు. ఈ ఏడాది ఫాల్గుణ పౌర్ణమి మార్చి 24 ఆదివారం వచ్చింది. ఆరోజే లక్ష్మీ జయంతి కూడా కావడంతో ఈ ఏడాదిలో అదృష్టమైన రోజుగా మారింది.

పౌర్ణమి ప్రాముఖ్యత:
ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉపవాసం పాటించడం వల్ల శ్రీ మహా విష్ణువు మరియు చంద్రుడు అనుగ్రహాన్ని పొందుతారు. లక్ష్మీజయంతి సందర్భంగా ఫాల్గుణ పౌర్ణమి నాడు ఆచారాల ప్రకారం అమ్మవారిని పూజించాలి. లక్ష్మీదేవికి ఇష్టమైన ఖీర్ సమర్పించాలి. ఎరుపు రంగు అంటే అమ్మవారికి చాల ఇష్టము కావున కుంకుమ్మ పూజలో తప్పకుండా అమ్మవారికి సమర్పించాలి. ఇలా చేయడం వల్ల ఇంట్లో ధన ప్రవాహం పెరిగి సంపదతో నిండిపోతుంది. డబ్బుకు ఎటువంటి లోటు ఉండదు. లక్ష్మీదేవి ఆశీస్సులు ఉంటే ఆ ఇల్లు సుఖసంతోషాలతో నిండిపోతుంది. సాధారణం గా హిందువులు పౌర్ణమి రోజు ఉపవాసం ఉంటారు . అయితే ఈ ఫాల్గుణ పౌర్ణమి రోజు ఉపవాసం ఉండిలక్ష్మి దేవికి పూజ చేస్తే అన్ని రకాల పాపాల నుండి విముక్తి పొందుతారని నమ్ముతారు.అదేవిధంగా ఈ రోజు హోళికా దహనం చేసిన తర్వాత
ప్రజలందరూ హోలీ పండుగను సంతోషంగా జరుపునుకుంటారు .






Untitled Document
Advertisements