జ‌ర్న‌లిస్ట్ లు మ‌హాన‌టి వ్య‌క్తిత్వాన్ని దిగ‌జార్చి మాట్లాడడం సరి కాదు.. ఆర్. నారాయ‌ణ‌మూర్తి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 03:09 PM

జ‌ర్న‌లిస్ట్ లు  మ‌హాన‌టి వ్య‌క్తిత్వాన్ని దిగ‌జార్చి మాట్లాడడం సరి కాదు..  ఆర్. నారాయ‌ణ‌మూర్తి

వెండి తెర మీద ఎంతో మంచి పేరు తెచుకున్న మ‌హాన‌టి సావిత్రి గురించి చెప్పనవసరం లేదు ఆమె సినిమా చేసింది అంటే కళ్ళకు కట్టినట్లుగా పాత్ర ఉంటుంది . నిజ జీవితంలో ఇలాగే జరుగుతుందా అనే విధంగా ఉంటుంది . ఆమె దాదాపు 300కు పైగా చిత్రాల్లో న‌టించిన లెజెండ‌రీ న‌టి.అంతేకాకుండా మూడు ద‌శాబ్ధాల సినీ ప్ర‌యాణంలో ఎన్నో సంచ‌ల‌నాలు న‌మెదు చేసారు. ఆమె చేయ‌న‌టి వంటి పాత్ర‌లేదు. పాత్ర‌కే వ‌న్న తీసుకొచ్చిన గొప్ప మ‌హాన‌టి. న‌టిగా దేశ వ్యాప్తంగా ఎన్ని పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదించిందో , వ్య‌క్తిగ‌త విష‌యాల్లోనూ సావిత్రి పేరు అప్ప‌ట్లో అంతే సంచ‌ల‌నంగానూ వినిపించేది. ఆమె వ్య‌క్తిగ‌త జీవితం ఇప్ప‌టికీ అంతుచిక్క‌ని ప్ర‌శ్నే. దానిపై జనాలకు అనేక సందేహాలున్నాయి.

తమిళ కథానాయకుడు జెమెని గణేశన్‌కు ఆకర్షితురాలు అవ్వడం , ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకోవడం.. డబ్బు లన్నీ పోగొట్టుకుని ఆర్థిక ఇబ్బందుల్లో పడటం చివరి రోజుల్లో బాగా ఇబ్బంది పడటం.. ఇలాంటి విషయాలపై జనాలకు స్పష్టమైన సమాచారం లేదు. తాజాగా ఆ మ‌హాన‌టికి ఆనాడు జ‌రిగిన అవ‌మానం గురించి విప్ల‌వ చిత్రాల ద‌ర్శ‌కుడు ఆర్. నారాయ‌ణ‌మూర్తి గుర్తి చేసి వాపోయారు. స్టార్ హీరోయిన్ గా కొన‌సాగుతోన్న స‌మ‌యంలోనే ఓ జ‌ర్న‌లిస్ట్ తో మొద‌లైన వివాదం ఆమెని ఎంత‌గా అవ‌మానిప‌రిచింద‌ని గుర్తు చేసారు.

ఇద్ద‌రి మ‌ధ్యఉన్న అహం ఏకంగా మ‌హాన‌టిని కోర్టు మెట్లు ఎక్కించింద‌న్నారు. పరమేశ్వర అనే జర్నలిస్టు -సావిత్రి మ‌ధ్య ఈగో అంత‌టి ఉత్ప‌త‌నానికి దారి తీసింద‌న్నారు. ఆయన మాట్లాడుతూ, 'పరమేశ్వర రాసిన వివాదాస్పద కథనాలు సావిత్రిని రెచ్చగొట్టాయి. దీంతో ఆమె చట్టపరమైన చర్య తీసుకోవలసి వచ్చింది. ఆ కేసు విష‌యంలో చీటికి మాటికి కోర్టుకు వెళ్లాల్సి వ‌చ్చేది. చివ‌రికి ఎలాగూ ఆ గొడ‌వ‌కి ఓ ప‌రిష్కారం దొరికింది. కానీ అదే స‌మ‌యంలో ఆమె వ్య‌క్తిత్వాన్ని దిగ‌జార్చి మాట్లాడుకున్నారంతా. ఆ ఘ‌ట‌న సావిత్రి ప్ర‌తిష్ట‌ను దిగ‌జార్చిన‌ట్లు అయింది. ఆమె కెరీర్ లో అదో మ‌చ్చ‌గా మారింది. బ‌హిరంగ హేళ‌న‌కు భౌతిక దాడికి సైతం గురి చేసింది. అది నాకెంతో బాధ క‌లిగించింది. ఉన్న‌వి లేన‌ట్లుగా .లేనివి ఉన్న‌ట్లు రాయోద్దు. ఇప్ప‌టి జ‌ర్న‌లిజంలో ఇలాంటివి ఎక్కువైపోయాయి. నేను ఒక‌టి అంటే మ‌రొక‌టి రాస్తున్నారు. ఇది జ‌నాల్లోకి త‌ప్పుగా వెళ్తుంది' కావున జ‌ర్న‌లిస్ట్ లు రాసేటప్పుడు ప్రజలను దృష్టిలో పెట్టుకొని రాయాలి . ఏది పడితే అది రాస్తే అదియే నిజం అని నమ్మేస్తారు . వారు మోసపోతారు అని గట్టిగా వాదించాడు .








Untitled Document
Advertisements