తప్పకుండ భవిష్యత్తులో ఆ పని చేసి తీరుతాను.. సాయి పల్లవి

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 03:36 PM

తప్పకుండ భవిష్యత్తులో ఆ పని చేసి తీరుతాను.. సాయి పల్లవి

టాలీవుడ్ లో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమాలో కథానాయిక భానుమతి పాత్ర పోషించిన సాయి పల్లవి. ఆమెను ముద్దుగా లేడీ పవర్‌ స్టార్‌ అంటూ పిలుచుకుంటారు. ఈ అమ్మడు సినిమాలు వచ్చి చాలా కాలం అయ్యింది. కొన్ని కారణాల వల్ల బ్రేక్ తీసుకున్న సాయి పల్లవి తిరిగి కెమెరా ముందుకు వచ్చింది. తెలుగు లో తండేల్ సినిమాతో ఈ అమ్మడు త్వరలో రాబోతుంది.

నాగ చైతన్య హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో రూపొందుతున్న తండేల్ సినిమా షూటింగ్‌ లో సాయి పల్లవి కనిపించబోతుంది. సినిమా ఆన్‌ లొకేషన్‌ స్టిల్స్ కొన్ని లీక్ అయ్యాయి. అందులో సాయి పల్లవి లుక్‌ ఆకట్టుకుంది. ఈ అమ్మడు మరోసారి ఫిదా చేయడం ఖాయం అంటూ ఫ్యాన్స్ ధీమాతో ఉన్నారు. తాజాగా సాయి పల్లవి ఒక చిట్ చాట్‌ లో తన డ్రీమ్‌ ను చెప్పుకొచ్చింది. ప్రస్తుతం హీరోయిన్ గా చేస్తున్నాను . కానీ నాకు ఒక కోరిక ఉంది తాను భవిష్యత్తు లో దర్శకత్వం చేస్తాను అంటూ చెప్పుకొచ్చింది. అంతే కాకుండా ప్రస్తుతం తన అభిరుచికి తగ్గ కథను కూడా రెడీ చేసే పనిలో ఉన్నట్లు సాయి పల్లవి చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. హీరోయిన్ గా ప్రస్తుతం టాప్ స్టార్‌ గా దూసుకు పోతున్నఈ అమ్మడు . దర్శకత్వం పై ఆలోచన కలగడం విడ్డూరంగా ఉంది. ఆమె సౌత్‌ లో అత్యధిక పారితోషికం అందుకుంటున్న హీరోయిన్స్ జాబితాలో ఉంది . అలాంటి ముద్దుగుమ్మ ఇప్పుడు దర్శకత్వం పై ఆసక్తి చూపించడం సరైన నిర్ణయం కాకపోవచ్చు అనేది కొందరి అభిప్రాయం. సాయి పల్లవి దర్శకత్వం చేయాలని కోరుకుంటున్నట్లుగా చెప్పుకొచ్చింది. అయితే అది ఎప్పుడు, ఎలా అనేది మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. కనుక ఆమె దర్శకత్వంలో సినిమాకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. హీరోయిన్‌ గా క్రేజ్ తగ్గినంత మాత్రాన దర్శకత్వం చేయాలి అనే ఆలోచన కరెక్ట్ కాదేమో అని కొందరు చెప్పుకొస్తున్నారు . మరి కొందరు అయితే ఈమె చేసే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఈ అమ్మడు మాటలను వైరల్ చేస్తున్నారు .







Untitled Document
Advertisements