తండ్రి పేరుకు బదులు గురువుగా ఆ హీరో పేరు చెప్పిన మ‌హేష్ మంజ్రేక‌ర్ కూతురు

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 04:39 PM

తండ్రి పేరుకు బదులు గురువుగా ఆ హీరో పేరు చెప్పిన మ‌హేష్ మంజ్రేక‌ర్ కూతురు

బాలీవుడ్ న‌టుడు మ‌హేష్ మంజ్రేక‌ర్ దర్శకత్వము చేయడమే కాకుండా తన స్వంత చిత్రాలే కాకుండా పలు చిత్రాల్లో నటించాడు. 2002 లో వచ్చిన కాంటే అనే సినిమా ద్వారా నటుడిగా మంచి గుర్తింపు పొందాడు. ఆ తరువాత 2007లో ఒక్కడున్నాడు అనే సినిమాలో ప్రతినాయకుడి పాత్ర, పోషించాడు . అంతే కాకుండా ఒక జాతీయ పురస్కారం, రెండు స్టార్ స్క్రీన్ అవార్డులు పొందాడు . ఇవే కాకుండా ఆస్కార్ పురస్కారాన్ని అందుకున్నాడు . ఇప్పుడు తన వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన స‌యి మంజ్రేక‌ర్ సుప‌రిచిత‌మే. తండ్రీ-కుమార్తెలిద్ద‌రు యాక్టింగ్ ప్రోఫెష‌న‌ల్ దూసుకుపోతున్నారు. డాడీ క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్ గా..విల‌న్ గా బిజీగా ఉంటే , డాట‌ర్ హీరోయిన్ పాత్ర‌ల‌తో బిజీగా ఉంది. త్వ‌ర‌లో ఇద్ద‌రు క‌లిసి ప‌నిచేయ‌డానికి రెడీ అవుతున్నారు. తండ్రి ద‌ర్శ‌క‌త్వంలో కుమార్తె మెయిన్ లీడ్ లో ఓ సినిమా చేయ‌డానికి రెడీ అవుతోంది. ఇక ఇద్ద‌రు క‌లిసి ఒకే ప్రేమ్ లో కనిపిస్తే గ‌నుక అది అద‌నంగా త‌న కెరీర్ కి బోన‌స్ లాంటింది.
ఇలా వృత్తి పరంగా అంత మంచి అనుబంధం ఉంది కుమార్తెకు. మ‌రి అలాంటి స‌మ‌యంలో కుమార్తెకు గురువు అంటే ఎవ‌ర్నీ చెప్పాలి, అంటే తండ్రి పేరే క‌దా చెప్పాలి అంటారు. కానీ ఇక్క‌డ స‌యి మంజ్రేక‌ర్ తండ్రికి బ‌ధులుగా స‌ల్మాన్ ఖాన్ పేరు చెప్పింది. త‌న గురువు కేవ‌లం స‌ల్మాన్ ఖాన్ ఒక్క‌డే అంటోంది. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో అడుగు పెట్టిన నుంచి ఆయ‌నే నా గురువు అంటూ మీడియా మందుకొచ్చింది. స‌ల్మాన్ ఖాన్ హీరోగా న‌టించిన `ద‌బాంగ్-3` సినిమాతోనే స‌యి మంజ్రేక‌ర్ న‌టిగా ప‌రిచ‌య‌మైంది.ఆ త‌ర్వాత `మేజ‌ర్` లో న‌టించి పాన్ ఇండియాలో గుర్తింపు ద‌క్కించుకుంది. `గ‌ని, స్కంద` లాంటి చిత్రాల్లో కూడా ఈ అమ్మ‌డు తన బ్యూటీతో అవ‌కాశాలు దక్కిచుకుంది . కానీ వాటి ఫ‌లితాల సంగ‌తి తెలిసిందే. అయితే స‌ల్మాన్ ని గురువు అన‌డానికి కొన్ని ప్ర‌త్యేక కార‌ణాలు చెప్పుకొచ్చింది. అప్పుడే చిత్ర ప‌రిశ్ర‌మ‌కి వ‌చ్చిన త‌న లాంటి ఎంతో మందికి ఆయ‌న అవ‌కాశాలు క‌ల్పించారని అలా ఛాన్స్ రాక‌పోతే మెకప్ వేసుకునే అవ‌కాశం వచ్చేది కాదు అంటుంది . ఆ ర‌కంగా తొలి ఛాన్స్ ఇచ్చిన వారిని గురువుగా భావించానంటోంది. అలా స‌ల్మాన్ తో ఏర్ప‌డిన ప‌రిచ‌యం ఇప్ప‌టికీ ఎంతో ప‌దిలంగా ఉందంది. తాను ఏ సినిమా చేసినా స‌ల్మాన్ ఖాన్ సూచ‌న‌లు స‌ల‌హాలు త‌ప్ప‌క తీసుకుంటుందిట‌. త‌ను న‌టించ‌డానికంటే ముందుగా స‌ల్మాన్ వ‌ద్ద‌కు వెళ్లి త‌న పాత్ర గురించి చెబుతుందిట‌ .ఈ విధంగా తనకు మొదటగా హీరోయిన్ ఛాయస్ ఇచ్చిన సల్మాన్ నా మొదటి గురువు అని చెపుకొస్తుంది .ఏది ఏమైనా ఇప్పుడు తండ్రి కూతురు కలిసి చేసే సినిమా ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి మరి .






Untitled Document
Advertisements