పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా?

     Written by : smtv Desk | Sat, Mar 23, 2024, 04:53 PM

పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో బన్నీ సినిమా?

ఐకాన్ స్టార్ గా పేరుపొందిన అల్లు అర్జున్‌ బన్నీ సినిమాతో మంచి పేరు సంపాదించుకున్నాడు . ఆతర్వాత వచ్చిన సినిమాలు కూడా బ్లాక్ బాస్టర్ హిట్లు గా నిలిచాయి .బన్నీ ప్రస్తుతం చేస్తున్న పుష్ప 2 తర్వాత అట్లీ దర్శకత్వంలో ఒక సినిమా చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. మెగా కాంపౌండ్ నుంచి కూడా అట్లీ సినిమా గురించిన వార్తలు వచ్చాయి. ఈ ఏడాది చివర్లో ప్రారంభం అవ్వాల్సిన అల్లు అర్జున్‌ - అట్లీ సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయంలో క్లారిటీ లేకుండా ఉంది. ఇటీవల అల్లు అర్జున్‌ ను కలిసి అట్లీ కథ చెప్పడం జరిగిందట. ఆ కథను బన్నీ సున్నితంగా తిరస్కరించి మరో కథ తో రావాలని చెప్పాడట. దాదాపు మూడు నెలల పాటు వర్క్‌ చేసి రెడీ చేసిన కథ ను అల్లు అర్జున్‌ వద్దు అనడంతో అట్లీ డైలమాలో పడ్డాడు.అనే టాక్ వస్తున్నది . ఇప్పుడు ఎలాంటి కథను బన్నీకి రాయాలో అర్థం కాక అట్లీ జుట్టు పీక్కుంటున్నాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. మరో వైపు పుష్ప 2 సినిమా తో పాటు పుష్ప 3 పై బన్నీ చాలా సీరియస్ గా ఉన్నాడు. మూడో పార్ట్‌ కూడా పూర్తి అయిన తర్వాతే ఇతర సినిమాల గురించి ఆలోచిస్తే బాగుంటుందని బన్నీ భావిస్తున్నాడనే ప్రచారం కూడా జరుగుతోంది. బాలీవుడ్‌ బాద్‌ షా షారుఖ్ ఖాన్‌ తో జవాన్ సినిమాను రూపొందించి వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధించిన అట్లీ కథను తిరష్కరించిన అల్లు అర్జున్ తన తదుపరి సినిమాను ఎవరితో చేస్తాడా అంటూ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆ మధ్య సందీప్‌ వంగ తో పాటు త్రివిక్రమ్‌ సినిమా లను బన్నీ ప్రకటించాడు. సందీప్ వంగతో సినిమాకు చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయి. ఆయన వచ్చే ఏడాది స్పిరిట్ ను మొదలు పెడతాడు. ఆ తర్వాత యానిమల్‌ పార్క్ ను చేయాల్సి ఉంది. ఆ తర్వాత బన్నీ తో సినిమా ఉంటుంది. అంటే కనీసం మూడు నాలుగు సంవత్సరాలు పట్టే అవకాశాలు ఉన్నాయి. ఇంతకు పుష్ప 2 సినిమా ముగిసిన తర్వాత బన్నీ పుష్ప 3 కౌంటీన్యూ చేస్తాడా ? లేదా? మరే ఏ సినిమాకైనా ఓకే చెప్తాడా అనే విషయం ఇంకా తేలియాల్సింది ఉంది .





Untitled Document
Advertisements