ఉగాది కానుకగా విజయ్ దేవరకొండ " ఫ్యామిలీ స్టార్ "

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 02:16 PM

ఉగాది కానుకగా విజయ్ దేవరకొండ

టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డితో మన ముందుకు వచ్చి తన నట విశ్వరూపంతో బాక్స్ ఆఫీసు రికార్డ్ సృష్టించాడు. ఆ సినిమా తో పెద్ద స్టార్ గా మారిపోయాడు. మొదట్లో వచ్చిన సినిమాలతో తనకు ఎలాంటి గుర్తింపు రాలేదు . తర్వాత వచ్చిన సినిమాలు మంచి పేలును తీసుకువచ్చాయి . మళ్ళీ అదే సంవత్సరంలో వచ్చిన గీత గోవిందంతో మరొక బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు.
అంతేకాకుండా ప్రస్తుతం మరో 10 రోజుల్లో ఫ్యామిలీ స్టార్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. లైగర్ సినిమాతో డిజాస్టర్ అందుకున్న దేవరకొండ.. ఖుషీతో డీసెంట్ హిట్ కొట్టారు. ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ తో గట్టి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నారు. గీతా గోవిందంతో విజయ్ కు బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన పరశురామ్ పెట్ల దర్శకత్వం వహించిన ఈ సినిమా ఏప్రిల్ 5వ తేదీన ఉగాది సందర్భంగా విడుదల కానుంది.

స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవల కంప్లీట్ అయింది. పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ శరవేగంగా జరుగుతున్నాయి. మరోవైపు, ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు మేకర్స్. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన నంద నందనా, కళ్యాణి వచ్చా పాటలు చాట్ బస్టర్ గా నిలిచాయి. మ్యూజిక్ లవర్స్ ను బాగా ఆకట్టుకున్నాయి. సోషల్ మీడియాలో ఇప్పటికీ ఫుల్ ట్రెండింగ్ లోనే ఉంటున్నాయి.

హోలీ పండుగ సందర్భంగా మేకర్స్.. ఈ సినిమా నుంచి మూడో సింగిల్ ను విడుదల చేశారు. మధురము కదా మెలోడియస్ లిరికల్ సాంగ్ ను రివీల్ చేశారు. ఈ పాటలో హీరోయిన్ హీరోపై ఉన్న ఫీలింగ్స్ ను అద్భుతంగా వర్ణిస్తోంది. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గోపీ సుందర్ క్లాసికల్ టచ్ తో మధురమైన ట్యూన్ అందించారు. శ్రీ మణి సాహిత్యం అదిరిపోగా తన వాయిస్ తో శ్రేయా ఘోషల్ ప్రాణం పోసింది. ఇక నందనందనా సాంగ్ లో విజయ్ హైదరాబాద్ వీధుల్లో డ్యాన్స్ చేస్తున్నట్లు కనిపించగా ఈ సాంగ్ లో విదేశాల్లో మృణాల్ ఠాకూర్ డ్యాన్స్ వేస్తోంది. విజయ్, మృణాల్ ఇద్దరూ హోమ్లీగా, ఎంతో అందంగా కనిపిస్తున్నారు. విజువల్స్ తోపాటు బ్యాక్ గ్రౌండ్ అదిరిపోయాయి. ఈ పాటలు బాగా వైరల్ గా వినబడుతున్నాయి . ఈ సినిమా దేవరకొండను ఏ రేంజ్ లో హిట్ చేస్తుందో చూడాలి , ప్రేక్షకులు ఏ విధంగా అభిమానిస్తారో మరి.








Untitled Document
Advertisements