కడుపుబ్బా నవ్విస్తున్న మూవీ ఓం భీమ్ బుష్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో బ్లాస్టింగ్

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 02:36 PM

కడుపుబ్బా నవ్విస్తున్న మూవీ ఓం భీమ్ బుష్.. శ్రీవిష్ణు ఖాతాలో మరో బ్లాస్టింగ్

తెలుగులో చాల రోజుల తర్వాత నవ్వుకోవడానికి ఒక మంచి సినిమాను యంగ్ హీరో శ్రీవిష్ణు, కమెడియన్లు ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణ. వీరి ముగ్గురి కాంబోలో విడుదలైన ఓం భీమ్ బుష్ మూవీ మంచి పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తోంది. గతంలో కూడా వీరు ముగ్గురూ కాంబినేషన్ లో వచ్చిన బ్రోచేవారెవరురా సినిమాతో అలరించగా ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై మరోసారిఈ ముగ్గురు సందడి చేస్తున్నారు

రిలీజ్ కు ముందు నుంచి ఈ సినిమా మంచి రేస్ ఫాన్స్ దిశలో ముందుకు దూసుకెళుతుంది . బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతోంది. మూడు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ టార్గెట్ దగ్గరకు చేరుకుంది. తొలి రోజు కంటే రెండో రోజు, రెండో రోజు కంటే మూడో రోజు ఎక్కువ వసూళ్లు రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా ఫస్ట్ మూడు రోజుల్లో ఈ సినిమా రూ.17 కోట్లకుపైగా వసూలు చేసింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించారు.


బ్లాస్టింగ్ పక్కా రూ.4.6 కోట్ల వసూళ్లతో అదిరిపోయే ఓపెనింగ్స్ సాధించిందీ ఓం భీమ్ బుష్ మూవీ. రెండో రోజు కలెక్షన్లు పెరిగి రూ.5.8 కోట్లకుపైగా రాబట్టింది. ఇక మూడో రోజైన ఆదివారం ఏకంగా రూ.6.56 కోట్లు కలెక్షన్లు సాధించింది. దీంతో మొత్తంగా మూడు రోజుల గ్రాస్ వసూళ్లు రూ.17 కోట్లకుపైగా వచ్చినట్లు మేకర్స్ ప్రకటించారు. ఇక యాఎస్ లో ఈ సినిమా $315K వసూళ్లు రాబట్టిందని, అక్కడ కూడా దూసుకుపోతుందని వెల్లడించారు. అయితే ఈ సినిమా మరికొద్ది రోజుల్లోనే లాభాల బాట పట్టనుందని అంచనా వేస్తున్నారు ట్రేడ్ పండితులు. సోమవారం (మార్చి 25) హోలీ, శుక్రవారం (మార్చి 29) గుడ్ ఫ్రైడే ఈ సినిమాకు బాగా కలిసి వస్తాయని చెబుతున్నారు. ఫస్ట్ వీక్ కంప్లీట్ అయ్యేలోపు ఓం భీమ్ బుష్ మూవీ మంచి లాభాల్లోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. శ్రీహర్ష కొనుగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకున్న విషయం తెలిసిందే. ఇక ఈ మూవీలో శ్రీవిష్ణు తో పాటు రాహుల్ రామకృష్ణ, ప్రియదర్శి కామెడీకి థియేటర్లలో ఆడియన్స్ ఫుల్ గా నవ్వుకుంటున్నారు. ముగ్గురూ కూడా మరోసారి తమ కామిక్ టైమింగ్ తో అదరగొట్టారు. ముగ్గురు ఫ్రెండ్స్ చుట్టూ తిరిగిన స్టోరీనే ఓం భీమ్ బుష్ మూవీ. గతేడాది సామజవరగమనతో మంచి హిట్ట్ సంపాదిచిన శ్రీవిష్ణు . ఇప్పుడు వచ్చిన ఈ సినిమాతో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. మొత్తానికి ఈ సినిమా బ్లాక్ బ్లాస్టర్ హిట్ నిలిచి ఇటు మేకర్స్ కి అటు ప్రేక్షకులను మేపిస్తుంది .







Untitled Document
Advertisements