సాధార‌ణ అమ్మాయిలా స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్న శ్ర‌ద్ధా

     Written by : smtv Desk | Mon, Mar 25, 2024, 02:51 PM

సాధార‌ణ అమ్మాయిలా స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటున్న శ్ర‌ద్ధా

శ్ర‌ద్ధా కపూర్ తన నటన ద్వారా ఇటు బాలీవుడ్, అటు టాలీవుడ్ ప్రేక్షకులను మేప్పించడమే కాకుండా , విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే కాక, బాలీవుడ్ లో తన స్థానాన్ని స్థిరం చేసుకుంది. ఆమె నటించిన సినిమాలన్నీ కమర్షియల్ గా కూడా మంచి విజయం సాధించాయి . ఆమె నటన తో పాటు , తన సినిమాల్లో చాలా పాటలు పాడింది శ్రద్ధా. ఆమె చాలా బ్రాండ్ లకు, ఉత్పత్తులకు అంబాసిడర్ గా కూడా పనిచేస్తోంది. తన స్వంత ఫ్యాషన్ డిజైనింగ్ స్టోర్ ను కూడా ప్రారంభించింది ఆమె. ఆమె స్టేజ్ షోలలోనూ, కచేరీల్లో కూడా పాల్గొంటూ ఉంటుంది . అంతేకాకుండా యూత్ పిచ్చిగా ఆరాధించే అంద‌మైన‌, ప్ర‌తిభావంత‌మైన న‌టి. సోషల్ మీడియాలో విపరీతమైన ఫాలోయింగ్ ని ఆస్వాధిస్తోంది. అభిమానులు, ప్రేక్షకులు శ్ర‌ద్ధాను పిచ్చిగా ప్రేమిస్తారు. 'ఆషిఖి 2' స‌హా ఎన్నో రొమాంటిక్ ల‌వ్ స్టోరీస్ లో శ్ర‌ద్ధా న‌ట‌న‌, అంద‌చందాల‌కు ఫిదా అయిపోయారు ఫ్యాన్స్. చాలాసార్లు శ్రద్ధాపై అప‌రిమిత‌ ప్రేమను ప్ర‌ద‌ర్శించే నెటిజ‌నుల హంగామా గురించి తెలిసిందే. ఇదే విధంగా హిందీ చిత్ర‌సీమ‌లో అగ్ర క‌థానాయిక అయినా కానీ, శ్రద్ధా కపూర్ ఒదిగి ఉండే స్వ‌భావం, అంద‌రినీ క‌లుపుకుని పోయే త‌త్వం మ‌రింత‌గా త‌న‌పై ప్రేమ‌ను పెంచుతుంది. శ్ర‌ద్ధా విన‌య‌విధేయ‌త‌ల గురించి ప్ర‌తి ఒక్క‌రూ మాట్లాడుకుంటారు. ఇంత‌కుముందు 'సాహో' చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలో శ్ర‌ద్ధా విధేయ‌త‌కు డార్లింగ్ ప్ర‌భాస్ సైతం స్పెల్ బౌండ్ అయిపోయాడు. త‌న‌కు ద‌గ్గ‌రుండి మ‌రీ వెరైటీ వంట‌కాల‌తో క్యారేజీని తినిపించాడు. అంత‌గా మ‌న‌సుల్ని దోచేస్తుంది శ్ర‌ద్ధా.

అలాగే శ్ర‌ద్ధా ఒక సాధార‌ణ అమ్మాయిలా స్ట్రీట్ ఫుడ్ జంక్ ఫుడ్ తింటుంది. వడ పావ్‌లను ఆస్వాధిస్తుంది. చాలా సార్లు శ్రద్ధా తన విలాసవంతమైన కారును వ‌దిలేసి ఆటో-రిక్షా రైడ్‌ను ఆస్వాధించింది. ఒక సామాన్య యువ‌తిలా న‌గ‌రంలో తిరిగేస్తుంది. ఇలాంటి వైవిధ్యం త‌న‌కు మాత్ర‌మే చెల్లింది. అభిమానులకు శ్ర‌ద్ధా నిజ‌మైన డార్లింగ్. తన అభిమానులను హోదాతో సంబంధం లేకుండా అంద‌రినీ ఒకేలా సమానంగా గౌరవిస్తుంది ప్రేమిస్తుంది. ఇటీవల శ్ర‌ద్ధా తన పుట్టినరోజు సందర్భంగా 30 మంది అభిమానులను ఆహ్వానించి గౌర‌వించారు. వారితో క‌లిసి శ్ర‌ద్ధా ప్ర‌యాణించింది. అభిమానుల ప్రేమే శ్ర‌ద్ధా నేటి ఈ స్థాయికి కార‌ణ‌మ‌ని కూడా న‌మ్ముతుంది. ఇటీవ‌ల రెండు పాపుల‌ర్ అవార్డు ఫంక్షన్‌లలో శ్ర‌ద్ధాకు ''మోస్ట్ స్టైలిష్ ఫ్యాన్ ఫేవరెట్ సూపర్‌స్టార్''.. ''ఫ్యాన్స్ ఫేవరెట్ స్టార్'' బిరుదులను అందించినప్పుడు ఆ గౌరవ క్షణాల‌ను శ్ర‌ద్ధా ఆస్వాధించింది.

అభిమానుల్లో త‌న‌కు ఉన్న ఫాలోయింగ్, ప్రేమ‌ను దృష్టిలో ఉంచుకుని .. ఇటీవలి సంవత్సరాలలో ఆమె అందించిన అసాధారణమైన ప్రదర్శనలకు ఈ ప్రతిష్టాత్మక అవార్డుల‌ను అందించారు. అభిమానులు, ప్రేక్షకులు ఎల్లప్పుడూ శ్రద్ధకు మద్దతుగా ఉన్నారు. శ్రద్ధా కపూర్ అసాధార‌ణ‌ అభిమానుల శక్తి, సోషల్ మీడియాలో అభిమానుల వ్యాఖ్యలు ప్ర‌శంస‌ల కార‌ణంగా.. పాపుల‌ర్ 'పాల్మోనాస్'తో బ్రాండ్ త‌న‌తో భారీ ఒప్పందాన్ని కూడా చేసుకుంది. దీనితో అభిమానుల సహాయంతో బ్రాండ్ డీల్ కుదుర్చుకున్న మొట్టమొదటి భారతీయ సెలబ్రిటీగా శ్రద్ధా కపూర్ చరిత్ర సృష్టించింది. ఈ డీల్ విలువ కోట్ల‌లో ఉంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. శ్రద్ధా కపూర్ ఈ ఫీట్ సాధించినందుకు అభిమానుల హావభావాలను గౌర‌విస్తూ వారికి కృతజ్ఞతలు తెలియజేస్తుంది. కెరీర్ విషయానికి వస్తే శ్రద్ధా కపూర్ లాంటి నటి ఎవరు ఉండరు అని చెపుకోవచ్చును. ఆమె చూపించే అభిమానం , ప్రేమ ,వలన ఇంత మంది ప్రేక్షకులు ఫాలోయింగ్, అవుతున్నారు . ఎంత అందమైన గుణం ఎవరికీ ఉంటుంది మరి .






Untitled Document
Advertisements