రాజమౌళి- మహేష్‌ బాబు ల సినిమా ఎప్పుడంటే?

     Written by : smtv Desk | Tue, Mar 26, 2024, 11:38 AM

రాజమౌళి-  మహేష్‌ బాబు ల సినిమా ఎప్పుడంటే?

తెలుగు సినీ నటుడు కృష్ణ కుమారుడు మహేష్ బాబు తన మొదటి సినిమా రాజకుమారుడు తోనే ఉత్తమ నూతన నటుడి పురస్కారం అందుకున్నాడు. అంతేకాకుండా నిజం సినిమాకు మొదటి సారిగా నంది ఉత్తమ నటుడు పురస్కారం అందుకున్నాడు. తర్వాత వరుసగా వచ్చిన సినిమాలు అతడు, దూకుడు, శ్రీమంతుడు చిత్రాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది పురస్కారాలు గెలుచుకున్నాడు.
ఇంత గొప్ప నటుడితో టాలీవుడ్‌ జక్కన్నగా పేరు పొందిన రాజమౌళి చేయబోయే సినిమా మహేష్ బాబుతో అనే విషయం కన్ఫర్మ్‌ అయ్యింది. ఇటీవలే రాజమౌళి జపాన్‌ లో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో మహేష్ బాబుతో తన తదుపరి సినిమా ఉంటుంది. అందుకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్‌ జరుగుతుందని చెప్పుకొచ్చాడు.

గుంటూరు కారం సినిమా తర్వాత మహేష్ బాబు గ్యాప్ తీసుకుని రాజమౌళి సినిమా కోసం కొత్త గెటప్‌ కి ట్రై చేస్తున్నాడు. ఇప్పటికే గడ్డం మరియు మీసాలు పెంచడం ద్వారా విభిన్నమైన లుక్‌ లోకి వచ్చాడు. ఇక కండలు పెంచేందుకు కూడా మహేష్ బాబు వర్కౌట్స్ మొదలు పెట్టాడు అంటూ ఆ మధ్య వార్తలు పుట్టుకు వచ్చాయి.

నిన్న మొన్నటి వరకు మహేష్ బాబు - రాజమౌళి కాంబో మూవీ అధికారిక ప్రకటన ఏప్రిల్‌ 9న ఉగాది కానుకగా రాబోతుందనే వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం మహేష్‌ బాబు బర్త్‌ డే సందర్భంగా అంటే ఆగస్టు 9న సినిమా అఫిషియల్‌ అనౌన్స్మెంట్‌ ఉంటుందని తెలుస్తోంది. ఆగస్టు 9న మహేష్ బాబుతో కలిసి రాజమౌళి మీడియా ముందుకు రాబోతున్నాడు. ఆ రోజున సినిమా ఎలా ఉంటుంది అనే విషయాన్ని తెలియజేసే విధంగా ఒక కాన్సెప్ట్‌ పోస్టర్ ను కూడా విడుదల చేసే విధంగా రాజమౌళి ప్లాన్‌ చేస్తున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది.

హాలీవుడ్‌ రేంజ్ లో భారీ అడ్వంచర్‌ యాక్షన్‌ థ్రిల్లర్ గా ఈ సినిమా ను రాజమౌళి రూపొందించబోతున్నాడు. మెజార్టీ పార్ట్ విదేశాల్లో చిత్రీకరించబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ ను ఈ సినిమాలో నటింపజేసేందుకు రాజమౌళి చర్చలు జరుపుతున్నాడు అనే వార్తలు రెండు మూడు రోజులుగా వస్తున్నాయి. ఆ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది.దీనిని బట్టి మహేష్ బాబు రాజమౌళి డైరెక్షన్ లో వచ్చే సినిమా ఏ రేంజ్ లో ఉంటుందో అని ఊహించుకోవడానికి కూడా ప్రేక్షకులకు అంతు పట్టడం లేదు . ఈ సినిమా గురించి అన్ని విషయాలు తెలియాలి అంటే మహేష్ బాబు పుట్టిన రోజు అయిన ఆగస్టు 9 వరకు వెయిట్ చేయక తప్పదు .





Untitled Document
Advertisements