రాశీఖ‌న్నా క‌ల‌లు కనే ద‌ర్శ‌కుడు ఎవరో తెలుసా ?

     Written by : smtv Desk | Sat, Mar 30, 2024, 12:24 PM

రాశీఖ‌న్నా క‌ల‌లు కనే ద‌ర్శ‌కుడు ఎవరో తెలుసా ?

టాలీవుడ్ లో ఊహలు గుసగుసలాడే సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయి ప్రేక్షకులను మెప్పించిన ముద్దుగుమ్మ రాశి ఖన్నా. ఆ తర్వాత ఎన్నో సినిమాలు చేసి విజయ పథకాన్ని ఎగురవేసింది . సౌత్ ఇండస్ట్రీలో ముఖ్యంగా టాలీవుడ్‌ లో హీరోయిన్‌ గా రాణించాలంటే సన్నగా నాజూకుగా ఉండాలి. ఆ విషయాన్ని పట్టిన రాశి ఖన్నా కష్టపడి చాలా బరువు తగ్గి బొద్దుగుమ్మ కాస్త ముద్దుగుమ్మ అన్నట్లు తయారు అయ్యింది. ఆమె కోరుకున్నట్లుగానే సన్నగా అయ్యాక యంగ్‌ హీరోలకు జోడీగా నటించే అవకాశాలు దక్కాయి. ప్రస్తుతం సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా రాశి ఖన్నా ఎక్కువ దృష్టి పెట్టింది. హిందీలో కూడా వరుసగా సినిమాలకు కమిట్‌ అవుతోంది.

తాజాగా ఒక జాతీయ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది. తనకు ఇండస్ట్రీలో ఒక డ్రీమ్ ఉందని, అదే దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వర్క్ చేయాలి. ఆయనతో నేనే కాదు దాదాపు అందరు హీరోయిన్స్ కూడా ఆయన దర్శకత్వంలో ఒక్కసారి అయినా నటించాలని కోరుకుంటారు. ఎందుకంటే ఆయన సినిమాల్లో హీరోయిన్స్ కి ఉండే ప్రాముఖ్యత గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆడవారిని గొప్పగా చూపించే దర్శకుల్లో సంజయ్‌ లీలా భన్సాలీ ముందు ఉంటారు. ఆయన సినిమాలను విమర్శకులు సైతం మెచ్చుకుంటూ ఉంటారు. అలాంటి గొప్ప దర్శకుడి దర్శకత్వంలో నటించడం అనేది నా కల అంటూ రాశి ఖన్నా చెప్పుకొచ్చింది. ఇక రాశి ఖన్నా ప్రస్తుత సినిమాల విషయానికి వస్తే ది సబర్మతీ రిపోర్ట్‌ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీగా ఉంది. మరో వైపు ఫర్జీ అనే వెబ్‌ సిరీస్ తో ఈ అమ్మడు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫర్జీ పై రాశి ఖన్నా చాలా నమ్మకం గా కనిపిస్తోంది. మరి రాశి ఖన్నా సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో వర్క్ చేయాలి అనే కోరిక ఎప్పుడు తిరుతుందో చూడాలి . ప్రస్తుతానికి మాత్రం ఈ అమ్మడు కి తెలుగు లో ఎలాంటి సినిమాలు లేనట్లుగా అనిపిస్తుంది .





Untitled Document
Advertisements