ఏళ్ళు గడిచినా వన్నె తగ్గక అతివల అందాన్ని మరింత పెంచే ముత్యాల హారాలు..

     Written by : smtv Desk | Tue, Apr 02, 2024, 12:13 PM

ఏళ్ళు గడిచినా వన్నె తగ్గక అతివల అందాన్ని మరింత పెంచే ముత్యాల హారాలు..

భారత దేశంలోని ఆడవాళ్లకు చీరలు, నగల అంటే ఎంత ఇష్టంమో చెప్పనవసరం లేదు .ఏ పండుగ వచ్చిన , పెళ్లి వచ్చిన సరే ట్రెండ్‌కు తగ్గట్టు, సందర్భానికి తగ్గట్టు. చీరలు, నగలు కోనుకొని ధరించి అందంగా మెరిసిపోవాలని కోరుకుంటారు మగువలు. కాలంతో పాటు ఆడవారి ఫ్యాషన్లు మారడం సహజం. కానీ, ఎన్నేళ్లు గడిచినా కొన్ని ఆభరణములు మాత్రం వన్నె తరగనివి ఉంటాయి . అవి ఏంటి అంటే ముత్యాలదే. చిన్నగా తెల్లగా మెరిసిపోతూ మగువులకు మరింత అందాన్ని తీసుకొస్తాయి. ముత్యాల నగలు. అటు ట్రెండీగా, సాంప్రదాయంగా ఆకట్టుకుంటాయి. చీర మీదైనా, లెహంగా, డ్రెసెస్‌ మీద కుడా చక్కగా నప్పుతాయి. అదే సమయంలో ముత్యాల నగలు ధరించిన వారి దర్భాన్ని కూడా పెంచుతాయి. ప్రతి అమ్మాయి, మహిళ జ్యూలరీ బాక్స్‌లో ఉండాల్సిన టాప్‌ 4 ముత్యాల నగలు ఏమిటో ఈ స్టోరీలో చూద్దాం.



ముత్యం లాకెట్‌:

మీ సొగసైన మెడలో ఈ పెర్ల్‌ లాకెట్‌ ధరిస్తే మీ లుక్‌ ఇంకా ఎలివేట్‌ అవుతుంది. మీరు ఎలాంటి డ్రెస్‌ వేసుకున్నా సరే ఈ ముత్యం లాకెట్‌ సూట్‌ అవుతుంది. అయితే ముత్యాలా చాలా సున్నితంగా ఉంటాయి.కావున మీరు మేకప్‌, డ్రెస్సింగ్‌ పూర్తయ్యాక చివరగా మెడలో పెర్ల్‌ లాకెట్‌ ధరించాలి. వీటిని వేసుకున్నాక మేకప్‌, హెయిర్‌స్ప్రే జోలికి వెళ్లకూడదు. వాటిలో ఉన్న కెమికల్స్‌ ముత్యాల నాణ్యతను, మెరుపును తగ్గిస్తాయి.అంతేకాకుండా ధరించిన ప్రతిసారీ రాత్రి నిద్రపోయేముందు వీటిని తీసి భద్రపరిచేయాలి.




ముత్యాల బ్రాస్‌లెట్‌:

ఈ ముత్యాల బ్రాస్‌లెట్స్‌ ఇవి ఎప్పుడూ ఓల్డ్‌ ప్యాషన్‌ కావు. ఇవి ట్రెండీగా, క్లాసీగా కనిపిస్తాయి. మీ క్లాస్‌ను కూడా పెంచుతాయి. ముత్యాల బ్రాస్‌లెట్‌ పెట్టుకున్న వెంటనే మీరు ధరించిన డ్రెస్‌ లుక్‌ కూడా ఎలివేట్‌ అవుతుంది. ముత్యాల బ్రాస్‌లెట్‌. ఎథ్నిక్‌, ఆఫీస్‌ ఫిట్‌లతోనూ క్లాసిక్‌, చిక్‌గా కనిపిస్తాయి. మీరు ఏ డ్రెస్‌పైనా ముత్యాల బ్రాస్‌లెట్‌ ధరించవచ్చు.అంతే మీ అందన్ని కూడా పెంచుతాయి .



ముత్యాల చెవిరింగులు:

మీ నగల బాక్స్‌లో ఉండవలసినవి ముత్యాల చెవిరింగులు . పెర్ల్‌ డ్రాప్స్‌, స్టడ్‌లు, హోప్స్‌ ఇలా చాలా రకాలు ఉంటాయి. పెర్స్‌ ఇయర్‌ రింగ్స్‌ ఎలాంటి వారికైనా ప్రత్యేకమైన వైబ్‌ని తీసుకొస్తాయి. మీరు డైలీ వేర్‌ కలెక్షన్‌లోనూ పెర్ల్‌ ఇయర్‌రింగ్స్‌ పెట్టుకోవచ్చు. ట్రెండీ దుస్తులకు, సాంప్రదాయ వస్త్రాలకు సరిగ్గా సరిపోతాయి.



ముత్యపు ఉగరం:

శ్వేతవర్ణంలో మెరిసిపోతూ ఉండే ముత్యాన్ని పొదిగే ఉంగరం . ఇది స్వచ్ఛత, సమగ్రత, దాతృత్యాన్ని సూచిస్తుంది. పెర్ల్‌ రింగ్స్‌ ట్రెండీ లుక్‌ను తీసుకురావడంతోపాటు పాతకాలపు స్టేట్‌మెంట్ దుస్తులతోనూ బాగా నప్పుతాయి. స్కార్ఫ్‌లు, హై-నెక్ షీర్ టాప్‌లు, సున్నితమైన బ్యాగ్‌తో ఉత్తమంగా ఉంటాయి. ముత్యాలు డార్క్ షేడ్ దుస్తులతో ఉత్తమంగా కనిపిస్తాయి. ఆఫీస్, డేట్‌ నైట్‌లకు స్టైలిష్‌ ఫిట్‌గా కనిపిస్తాయి.

మనం ఎన్ని రకాలైన ఆభరణాలు ధరించిన రాని అందం ముత్యాల హారాలు వేసుకుంటే వస్తాయి . వీటిలో చాల రకాలైనవి ఉంటాయి . కొన్ని చిన్నవిగా , పెద్దవిగా ,డిఫరెంట్ మోడల్స్ లో ఉంటాయి . ఇవి సముద్రము నుండి లభిస్తాయి అందుకే అంత తెల్లగా , అందంగా ఉంటాయి .





Untitled Document
Advertisements