నా పారితోషికం విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను.. హీరో సుహాస్

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 11:11 AM

నా పారితోషికం విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను.. హీరో సుహాస్

ప్రస్తుతకాలంలో హీరో, హీరోయిన్లతో లేకుండా కంటెంట్ నచ్చితే చాలు సినిమాని ఆదరిస్తున్నారు ప్రేక్షకులు. అలా చిన్న సినిమాలతో హీరోగా నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్న హీరోలలో ఒకరు సుహాస్. సుహాస్ .. ఇప్పుడు వరుస హిట్లతో దూసుకుపోతున్నాడు. ఇటీవల ఆయన నుంచి వచ్చిన 'అంబాజీ పేట మ్యారేజీ బ్యాండు' సినిమా మంచి లాభాలను తెచ్చిపెట్టింది. ఆయన తాజా చిత్రంగా ప్రేక్షకుల ముందుకు రావడానికి 'ప్రసన్న వదనం'రెడీ అవుతోంది. మే 3వ తేదీన ఈ సినిమా విడుదల ఉండటంతో ప్రమోషన్స్ తో ఆయన బిజీగా ఉన్నాడు.

తాజా ఇంటర్వ్యూలో సుహాస్ మాట్లాడుతూ .. "ఒకసారి నేను కథ వినేసి ఓకే చెప్పిన తరువాత ఇంకా నేను పట్టించుకోను. పూర్తిగా దర్శకుడిని నమ్మేసి ముందుకు వెళతాను. కొత్త దర్శకులు కదా అని నేను భయపడను. ఎందుకంటే తమని తాము నిరూపించుకోవాలని ఒక పట్టుదల .. అందుకు తగిన భయం వారికి ఉంటాయి, అందువలన దర్శకుల విషయంలో నాకు ఎటువంటి టెన్షన్ లేదు" అన్నాడు.

" నేను 3 కోట్లకి పైగా పారితోషికం తీసుకుంటున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. పారితోషికం ఎంతనేది నేను చెప్పనుగానీ, మొదట్లో నాకు ఇచ్చిన పారితోషికం కంటే ఇప్పుడు బాగానే ఉంది. నా పారితోషికం విషయంలో నేను సంతృప్తికరంగానే ఉన్నాను. 'ప్రసన్నవదనం' తప్పకుండా పెద్ద హిట్ కొడుతుందని భావిస్తున్నాను" అని చెప్పాడు. మరి ఈ చిత్రం విడుదల తరువాత సుహాస్ మరింత బిజీగా మారిపోయే అవకాశం లేకపోలేదు.





Untitled Document
Advertisements