ఎండ వేడి నుండి ఉప‌శ‌మ‌నం కొరకు వినూత్నంగా ఆలోచించిన ట్ర‌క్ డ్రైవ‌ర్..

     Written by : smtv Desk | Thu, Apr 25, 2024, 11:48 AM

ఎండ వేడి నుండి  ఉప‌శ‌మ‌నం కొరకు వినూత్నంగా ఆలోచించిన ట్ర‌క్ డ్రైవ‌ర్..

రోజోరోజుకి ఎండలు తీవ్రతరం అవుతున్నాయి. ఆ బాలబానుడు వేసవికాలపు ప్రతాపాన్ని చూపుతూ ప్రజలను అల్లాదిస్తున్నాడు. కొద్దిరోజులుగా ఇండియాలో అనేక ప్రాంతాలలో 45 డిగ్రీలకు మించి ఉష్ణోగ్రతలు న‌మోద‌వుతున్నాయి. దీంతో బ‌హిరంగ ప్ర‌దేశాల్లో ప‌నిచేసేవారికి ఇబ్బందులు త‌ప్ప‌డం లేదు. ముఖ్యంగా ఎయిర్ కండిషనింగ్ అందుబాటులో లేని వారికి వేడి నుంచి ఉప‌శ‌మ‌నం పొంద‌డం అనేది అంత ఈజీ కాదు. అందులోనూ ట్రక్‌, బ‌స్సులు, లారీలు వంటి పెద్ద వాహ‌నాల‌ను న‌డిపే వారికి ఈ వేస‌విలో చుక్క‌లు క‌నిపించ‌డం ఖాయం.

అయితే, ఓ ట్ర‌క్ డ్రైవ‌ర్ వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం పొందేందుకు వినూత్న ఆలోచ‌న చేశాడు. డ్రైవింగ్ సీటు ప‌క్క‌నే ఒక బ‌కెట్‌లో చ‌ల్ల‌టి నీరు పెట్టుకున్నాడు. అందులో ఒక మ‌గ్ ఉంచి.. డ్రైవింగ్ చేస్తున్న స‌మ‌యంలో వేడిగా అనిపించినప్పుడ‌ల్లా మ‌గ్‌ను ముంచ‌డం, పైన వాట‌ర్ పోసుకోవ‌డం చేశాడు. ఇలా వేస‌వి తాపం నుంచి ఉప‌శ‌మ‌నం కోసం వెరైటీ ఉపాయం ఆలోచించిన ట్ర‌క్‌ డ్రైవ‌ర్ తాలూకు వీడియో ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. ఈ వీడియోను "45-50 డిగ్రీల ఉష్ణోగ్ర‌త‌లో బ‌స్సు లేదా ట్ర‌క్ నడిపించ‌డం అనేది ఎంత క‌ష్టం" అనే క్యాప్షన్ తో పోస్ట్‌ చేయ‌డం జ‌రిగింది.

ఇక‌ వీడియో చూసిన‌ నెటిజ‌న్లు త‌మ‌దైన శైలిలో కామెంట్ చేస్తున్నారు. "మజ్బూరీ హై భాయ్ క్యా కరే" అని ఒక‌రు డ్రైవర్ ప‌రిస్థితిపై సానుభూతి తెలిపారు. కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని ఉద్దేశించి మరొకరు హాస్యాస్పదంగా "గడ్కరీ జీ కో బోల్నా ప‌డేగా" అని వ్యాఖ్యానించారు. మరికొందరు "బహుత్ గర్మీ హై" అని పేర్కొన‌డం జ‌రిగింది. ప్రస్తుతం ఈ విడీయో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
https://twitter.com/fewsecl8r/status/1782684877059400025?ref_src=twsrc%5Etfw%7Ctwcamp%5Etweetembed%7Ctwterm%5E1782684877059400025%7Ctwgr%5Ea6dfcd8b3c6238990b977cd5986a5478ac538ce7%7Ctwcon%5Es1_c10ref_url=https%3A%2F%2Fwww.ap7am.com%2Ftn%2F799796%2Ftruck-driver-innovative-solution-to-beat-the-heat-impresses-internet





Untitled Document
Advertisements