గూగుల్ మ్యాప్స్ లో 'సూపర్ మారియో'..

     Written by : smtv Desk | Sun, Mar 11, 2018, 12:22 PM

గూగుల్ మ్యాప్స్ లో 'సూపర్ మారియో'..

హైదరాబాద్, మార్చి 11 : గూగుల్ మ్యాప్స్.. దారి తెలియనివారికి ఒక పెద్ద దిక్కు, సాంకేతికత అభివృద్ధి చెందిన తర్వాత ఎక్కడికి వెళ్లాలన్న అడ్రస్ కోసం స్మార్ట్ ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ మ్యాప్స్ ని అడగటం పరిపాటిగా మారింది. అంతలా గమ్యం చేర్చే సాధనంగా మారిన గూగుల్ మ్యాప్స్ మరో సరికొత్త విధానంలో మన ముందుకు రాబోతుంది. అదేంటంటే.. సూపర్ మారియో గేమ్ లో ఉండే ‘మారియో కార్ట్’ను యాప్ లోకి తీసుకువచ్చింది.

దారి కోసం గూగుల్ మ్యాప్స్ తెరవగానే మనం ప్రయాణిస్తున్న కొద్దీ ఓ బాణం గుర్తు కదులుతూ ఉంటుంది. ఇప్పుడు ఆ స్థానంలో బండిపై వెళుతున్న మారియో బొమ్మ సందడి చేయనుంది. ఈ సదుపాయాన్ని పొందడానికి ముందుగా గూగుల్ మ్యాప్స్ ను అప్ డేట్ చేసుకోవాలని గూగుల్ మ్యాప్స్ యూజర్ ఎక్స్ పీరియెన్స్ ఇంజనీర్ మునీశ్ దబాస్ తెలిపారు. ఇండియాలో మార్చి 12వ తేదీ నుండి ఈ సదుపాయం అందుబాటులోకి వస్తుందని ఆయన వెల్లడించారు.

Untitled Document
Advertisements