పచ్చిమామిడికాయలతో ఏంతో టేస్టీగా ఉండే కట్టామీటా జ్యూస్ రెసిపీ

     Written by : smtv Desk | Sat, May 18, 2024, 02:39 PM

పచ్చిమామిడికాయలతో ఏంతో టేస్టీగా ఉండే కట్టామీటా జ్యూస్ రెసిపీ

పచ్చిమామిడికాయలతో ఆవకాయ పచ్చడి, పులిహోర, మామిడి వరుగులు, మామిడికాయ పప్పు, పచ్చిమామిడికాయ జ్యూస్ వంటివి తాయారు చేస్తారు. అయితే పైన చెప్పినవన్నీ అందరికి తెలిసిన వంటలే. ఎవరి స్టైల్ లో వాళ్ళు చేస్తారు. పచ్చిమామిడికాయ జ్యూస్ ఎలా తయారుచేయాలి అనేది అందరికి సరిగ్గా తెలియదు. వేసవి ఎండల్లో చల్లదనాన్ని కలిగించే పచ్చి మామిడికాయ జ్యూస్ సింపుల్ గా ఎలా తయరుచేసుకోవాలో చూసేద్దాం..

పచ్చిమామిడికాయ జ్యూస్ కొరకు కావాల్ససిన పదార్థాలు..
పెద్ద మామిడికాయ ఒకటి
బెల్లం లేదా పంచదార 50 గ్రాములు
చిటికెడు యాలకుల పొడి
సబ్జా గింజలు ఒక టీస్పూన్
తయారీ విధానం.. ముందుగా మామిడికాయను ఉడికించి అందులో నుండి గుజ్జును తీసుకుని అందులో బెల్లం, యాలకుల పొడి కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మిక్సీలో వేసుకుని ఒక్కసారి చక్కగా బ్లెండ్ చేసుకోవాలి. మామిడికాయ జ్యూస్ రెడీ అయిపోతుంది. దీనిని అలాగే అయినా తగేయొచ్చు లేదా ఒక అరగంట ఫ్రీడ్జ్ లో పెట్టుకుని అయినా తాగొచ్చు. జ్యూస్ సర్వ్ చేయడానికి ముందు గ్లాస్ లో కొద్దిగా నానాబెట్టిన సబ్జాగింజలు వేసి అందులో జ్యూస్ పోసి సర్వ్ చేయాలి.

ఇప్పుడు కట్టామీటా మామిడికాయ జ్యూస్ రెసిపీ చూద్దాం..
కావాల్ససిన పదార్థాలు..
పెద్ద మామిడికాయ ఒకటి
చిన్న పచ్చిమిర్చి
అరంగుళం అల్లంముక్క
నాలుగు పుదీనా ఆకులు
హాఫ్ స్పూన్ వేయించిన జీలకర పొడి
చిటికెడు దాల్చిన చెక్కపొడి
ఒక టీస్పూన్ తేనే
కొద్దిగా ఉప్పు
సబ్జా గింజలు ఒక టీస్పూన్
తయారీ విధానం.. ముందుగా పచ్చిమామిడికాయను ముక్కలుగా కట్ చేసి వాటిని మిక్సీ జార్ లో వేయాలి. మామిడికాయ ముక్కలతో పాటు పైన చెప్పిన పదార్థాలన్నీ వేసుకుంటూ చక్కగా పేస్ట్ చేసుకుని తగినన్ని నీళ్ళు పోసుకుని జ్యూస్ లా చేసుకోవాలి. చివర్లో తేనే, నానబెట్టిన సబ్జా గింజలను వేసుకుని సర్వ్ చేసుకోవాలి. మీరు చల్లగా తాగాలి అనుకుంటే ఓ అరగంట పాటు ఫ్రిడ్జ్ లో పెట్టుకుంటే సరి.

Untitled Document
Advertisements