‘మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలబ్రిటీలలో' కోహ్లి @ నెంబర్ 1

     Written by : smtv Desk | Fri, Jan 11, 2019, 12:16 PM

 ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలబ్రిటీలలో' కోహ్లి @ నెంబర్ 1

జనవరి 11: ఇటీవల విడుదల చేసిన ఐసీసీ ర్యాంకింగ్ లో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి నంబర్‌వన్ ర్యాంక్‌లో ఉన్నాడు. క్రికెట్ లోనే కాకుండా ఇప్పుడు భారతదేశంలో కూడా ‘మోస్ట్‌ వాల్యుబుల్‌ సెలబ్రిటీ బ్రాండ్‌’గా అగ్రస్థానంలో నిలిచాడు. వరుసగా కోహ్లికి రెండోసారి ఇది.


కోహ్లి గతేడాది నవంబరు వరకు 24 ఉత్పత్తులకు ప్రచారకర్తగా చెయ్యగా, ప్రముఖ గ్లోబల్‌ వాల్యుయేషన్, కార్పొరేట్‌ ఫైనాన్స్‌ సలహాదారు సంస్థ ‘డఫ్‌ అండ్‌ ఫెల్ఫస్‌’ తాజా నివేదిక ప్రకారం విరాట్ బ్రాండ్ విలువ దాదాపు రూ.1,200 కోట్లు (170.9 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) అయింది. బాలీవుడ్ నటి దీపికా పడుకోన్‌ గత సంవత్సరం కంటే తక్కువ ర్యాంకులో నిలిచింది. 21 ఉత్పత్తులను ఎండార్స్‌ చేస్తున్న దీపికా రూ.718 కోట్ల (102.5 మిలియన్‌ అమెరికన్‌ డాలర్లు) బ్రాండ్‌ విలువతో రెండో స్థానం దక్కించుకుంది. తరువాత స్థానంలో బాలీవుడ్‌ హీరోలు అక్షయ్‌ కుమార్‌ (రూ.473 కోట్లు), రణ్‌వీర్‌ సింగ్‌ (రూ.443 కోట్లు) మూడు, నాలుగో స్థానాల్లో నిలిచారు.

Untitled Document
Advertisements