కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: సోమిరెడ్డి

     Written by : smtv Desk | Wed, May 09, 2018, 12:02 PM

కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోంది: సోమిరెడ్డి

విజయవాడ, మే 9: వ్యవసాయ ఉత్పత్తులను కేంద్రం మద్దతు ధరకు కొనుగోలు చేయడం లేదని, ఏపీ రైతుల పట్ల కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని మంత్రి సోమిరెడ్డి మండిపడ్డారు. వ్యవసాయ రంగంలో సమూల మార్పులు తెచ్చామని అయినప్పటికీ స్వామినాథన్ సిఫార్సులు అమలు చేస్తున్నామని కేంద్రం అసత్యాలు చెబుతోందని ఆయన ఆరోపించారు.

ఈ రోజు జిల్లాలో రూ.3కోట్లతో నిర్మించ తలపెట్టిన వ్యవసాయశాఖ కార్యాలయ నూతన భవనానికి మంత్రి సోమిరెడ్డి ఎమ్మెల్యే బోండా ఉమ, మేయర్ కోనేరు శ్రీధర్‌తో కలిసి శంకుస్థాపన చేశారు. కేంద్రం సహకరించక పోయినా రైతులకు అండగా ఉంటామని ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోండా ఉమ స్పష్టం చేశారు.

Untitled Document
Advertisements