అచ్చం ధోనిలా ..

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 05:42 PM

అచ్చం ధోనిలా ..

కోల్‌కతా, మే 16 : ప్రస్తుత క్రికెట్ మహేంద్ర సింగ్ ధోని వికెట్ కీపర్ గా వికెట్ల వెనుక మెరుపు వేగంతో కదులుతూ ఉంటాడు. మిస్టర్ కూల్ కీపర్ గా చేసే విన్యాసాలు అభిమానులను ఎంతోగానో ఆకట్టుకుంటాయి. రెప్పపాటులోనే మెరుపు వేగంతో చేతిలోని బంతితో వికెట్లను పడగొట్టి ఎంతో మంది బ్యాట్స్‌మెన్లను ధోనీ పెవిలియన్‌కు పంపించిన సన్నివేశాల్ని మనం అనేకం చూశాం. తాజాగా ధోనీలాగే మెరుపు వేగంతో ఓ వికెట్‌ కీపర్‌ వికెట్లను పడగొట్టి బ్యాట్స్‌మెన్‌ను ఔట్ చేశాడు. ఐపీఎల్‌లో భాగంగా రాజస్థాన్‌ రాయల్స్‌-కోల్‌కతా నైట్‌రైడర్స్‌ మధ్య జరిగిన మ్యాచ్‌లో ఈ సన్నివేశం చోటు చేసుకుంది.

రాజస్థాన్‌ రాయల్స్‌ జట్టు ఇన్నింగ్స్‌ 12వ ఓవర్లో కుల్‌దీప్‌ యాదవ్‌ వేసిన మొదటి బంతిని ఆడేందుకు బిన్నీ కాస్త ముందుకు వచ్చాడు. కానీ, ఆ బంతి బ్యాట్స్‌మెన్‌ను తప్పించుకుని వికెట్‌ కీపర్‌ చేతిలోకి వెళ్లింది. వెంటనే దినేశ్‌ కార్తీక్‌ తన చేతిలోని బంతితో మెరుపు వేగంతో వికెట్లను పడగొట్టాడు. దీంతో బన్నీ వ్యక్తిగత స్కోరు ఒకటి వద్దే పెవిలియన్‌ బాట పట్టాల్సి వచ్చింది. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ‘అచ్చంగా ధోనీలాగే దినేశ్‌ కార్తీక్‌ ఎంత బాగా ఔట్‌ చేశాడు; ధోనీలాగే దినేశ్‌ కూడా అప్పుడప్పుడు మాయ చేస్తున్నాడు; మెరుపు వేగంతో వికెట్లను పడగొట్టాడు’ అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. ఈ మ్యాచ్‌లో కోల్‌కతా గెలుపొంది ప్లేఆఫ్‌కు చేరింది.

Untitled Document
Advertisements