అదండీ ప్లేఆఫ్‌ లెక్క..!

     Written by : smtv Desk | Wed, May 16, 2018, 06:55 PM

అదండీ ప్లేఆఫ్‌ లెక్క..!

ముంబై, మే 16: మరో నాలుగు రోజుల్లో ఐపీఎల్‌ ఐపీఎల్‌ లీగ్‌ దశ ముగియనుంది. సాధారణంగా ఏటా లీగ్‌ చివరి దశకు చేరుకునే సమయానికి కనీసం మూడు జట్లు ప్లేఆఫ్‌ రేసు నుంచి బయటికి వచ్చేసేవి. ఈ ఏడాది ఒక్క ఢిల్లీ తప్ప తప్ప మిగతా ఐదు జట్లు ప్లేఆఫ్‌లో చోటు కోసం రేస్ లొ ఉన్నాయి. ఇప్పటికే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, చెన్నై సూపర్‌కింగ్స్‌ ప్లేఆఫ్‌కి ఆర్హత సాధించాయి. ఇక జరిగే మ్యాచ్‌ల్లో మిగతా టీంల ఓటమి కూడా మరో జట్టుకు లాభం చేకూరేలా మారాయి.

ఈ నేపథ్యంలో ఈ రోజు ముంబయి ఇండియన్స్‌-కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌ మ్యాచ్‌పై రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు జట్లు గంపెడు ఆశలు పెట్టుకుంది. ఈ మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోవాలని బెంగళూరు కోరుకుంటోంది. ఎందుకంటే.. ఇలా జరిగితేనే కదా ఆ జట్టు ప్లేఆఫ్‌ అవకాశాలు సజీవంగా ఉండేది. ఈ ఒక్క జట్టే కాదు కోల్‌కతా, రాజస్థాన్‌, ముంబయి, పంజాబ్‌ కూడా ఇప్పుడు ప్లేఆఫ్‌లో చోటు కోసం పోటీ పడుతున్నాయి. ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ఏ జట్టు ఓడితే మరి ఏ ఇతర జట్టుకు లాభమో, ఏ జట్టు ప్లేఆఫ్‌కు వెళ్లే అవకాశాలు సజీవంగా ఉంటాయో, ఏ జట్టుకు క్లిష్టంగా మారతాయో ఇప్పుడు చూద్దాం. ఆ లేక్కలేంటో ఒక లుక్కువేయండి.

* ముంబయి ఇండియన్స్‌: ఒకవేళ ఈ రోజు మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ విజయం సాధిస్తే ఆ జట్టు ప్లేఆఫ్‌కు చేరుకునే అవకాశాలు సజీవంగా ఉంటాయి. లీగ్‌లో చివరి మ్యాచ్‌లో ముంబయి... దిల్లీ డేర్‌డెవిల్స్‌పై గెలవాలి. మరోపక్క బెంగళూరుపై సన్‌రైజర్స్‌ నెగ్గాలి. అలాగే కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌.. చెన్నై చేతిలో, బెంగళూరు చేతిలో రాజస్థాన్‌ రాయల్స్‌ ఓడిపోవాలి. ఇలా జరిగితే నెట్‌ రన్‌రేట్‌ ఆధారంగా ముంబయి ప్లేఆఫ్‌ చేరుకునే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఈ రోజు మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్‌ ఓడిపోతే ప్లేఆఫ్‌ కు దూరమైనట్లే.

>> కింగ్స్‌ ఎలెవన్‌ పంజాబ్‌: ఈ రోజు జరిగే మ్యాచ్‌లో ముంబయిపైన, ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌పైనా విజయం పంజాబ్‌ సొంతం అయితే ఆ జట్టు ప్లేఆఫ్‌ చేరుకోవడం సులువు. ఒకవేళ ఈ రోజు ఓడిపోయినా పంజాబ్ ప్లేఆఫ్‌ ఆశలు సజీవంగా ఉంటాయి. ఎలా అంటే బెంగళూరు చేతిలో రాజస్థాన్‌, సన్‌రైజర్స్‌ చేతిలో బెంగళూరు ఓడిపోవాలి. ఇదే జరిగితే చివరి మ్యాచ్‌లో చెన్నైపై పంజాబ్‌ తప్పనిసరిగా గెలవాల్సిందే. ఒకవేళ ఈ రెండు మ్యాచ్‌ల్లోనూ పంజాబ్‌ ఓడిపోతే ఇంటి ముఖం పట్టాల్సిందే.

>> రాజస్థాన్‌ రాయల్స్‌: ఈ రోజు పంజాబ్ తో ఆ తర్వాత చెన్నై సూపర్‌కింగ్స్‌తో జరిగే మ్యాచ్‌ల్లో బెంగళూరు ఓడిపోతే రాజస్థాన్‌ రాయల్స్‌కు అవకాశం ఉంటుంది. అలాగే ఈ జట్టు బెంగళూరుపై విజయం సాధించాలి. మరోపక్క ముంబయి ఇండియన్స్‌ను దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఓడించాలని రాజస్థాన్‌ ప్రార్థనలు చేయాలి. ఇదేమీ కాకుండా రాజస్థాన్‌ తన తదుపరి మ్యాచ్‌లో బెంగళూరు చేతిలో ఓడిపోతే ప్లేఆఫ్‌కు దూరమైనట్లే.

>> రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు: టోర్నీలో భాగంగా బెంగళూరు తన తదుపరి మ్యాచ్‌లో హైదరాబాద్‌ చేతిలో ఓడిపోతే ప్లేఆఫ్‌ రేసుకు దూరమైనట్లే.

>> కోల్‌కతా నైట్‌రైడర్స్‌: ప్రస్తుతం మూడో స్థానంలో ఉన్న కోల్‌కతా తన తదుపరి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ చేతిలో గెలిస్తే ప్లేఆఫ్‌కి వెళ్తుంది.

Untitled Document
Advertisements