"మహానటి" హీరోయిన్ మనసులో మాట..

     Written by : smtv Desk | Mon, May 21, 2018, 12:19 PM


హైదరాబాద్, మే 21 : అలనాటి అందాల నటి, సావిత్రి జీవితం ఆధారంగా తెర‌కెక్కిన చిత్రం 'మ‌హాన‌టి'. కీర్తి సురేష్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రానికి నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు. సావిత్రి జీవితానికి సంబంధించిన విషయాలను అద్బుతంగా తెరకెక్కించిన విధానంపై ప్రతి ఒక్కరు ఈ ప్రశంసలు కురిపించారు. విడుదలైన నాటి నుండే హిట్ టాక్ తెచ్చుకొని బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ వర్షం కురిపిస్తోంది. అంతేకాకుండా 'మహానటి' ని తమిళంలో 'నడిగైయార్ తిలగం' పేరిట విడుదలైన అక్కడా మంచి టాక్ తెచ్చుకుంది.

ఈ సందర్భంగా కీర్తి సురేష్ తన మనసులోని అభిప్రాయాలను పంచుకున్నారు. ఓ ఇంటర్వ్యూలో.. సావిత్రి జీవితంలో జరిగిన విధంగానే ప్రేమ పెళ్లి, ఆపై సినిమాల నిర్మాణం, దర్శకత్వం వహిస్తారా? అన్న ప్రశ్నకు ఆసక్తికర సమాధానం చెప్పింది. తన కుటుంబ సభ్యులు అంతా సినిమా ఇండస్ట్రీలోనే ఉన్నారని గుర్తు చేస్తూ.. తన తండ్రి నిర్మాతని.. తాను నిర్మాతగా మరబోనని స్పష్టం చేసింది. ఇక దర్శకత్వం వహించేంత అర్హత గాని, అనుభవం గాని తనకు లేవని తెలిపింది. ప్రేమ వివాహం చేసుకుంటారా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. ఇప్పట్లో తనకు పెళ్లి ప్రస్తావనే అనవసరమని.. భవిష్యత్తులో తాను ఎవరినైనా ప్రేమిస్తే, ఆ విషయాన్ని తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పి వారి అంగీకారంతోనే పెళ్లి చేసుకుంటానని చెప్పుకొచ్చింది.

Untitled Document
Advertisements