వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ రానుందా..!

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 01:43 PM

 వారిద్దరి కలయికలో హ్యాట్రిక్ రానుందా..!

హైదరాబాద్, మే 24 : 'సింహా', 'లెజెండ్' వంటి చిత్రాలు నటరత్న బాలకృష్ణ సినీ కెరీర్ లో ఎంతో హిట్ వేరే చెప్పకర్లేదు. మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రాలు ప్రేక్షకులను ఎంతోగానో మెప్పించాయి. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మరో సినిమా రూపొందబోతుందట. వీరిద్దరి హ్యాట్రిక్ కాంబోలో తెరకెక్కే సినిమాకి ముహూర్తం కూడా ఖరారు అయిందని ఫిల్మ్ వర్గాల టాక్. నిజానికి బాలకృష్ణ 100వ చిత్రానికే బోయపాటి దర్శకత్వం వహించాల్సి ఉంది. అయితే కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు. తాజాగా వీరిద్దరి కలయికలో సినిమాకి రంగం సిద్ధమవుతుందని తెలుస్తోంది.


ఓ ప్రముఖ నిర్మాణ సంస్థ నిర్మించే ఈ సినిమాను జూన్ 10న బాలకృష్ణ పుట్టినరోజు కానుకగా లాంఛ్ చేయబోతున్నారట. ప్రస్తుతం బాలకృష్ణ 'ఎన్టీఆర్' బయోపిక్‌తో బిజీగా ఉన్నాడు. ముహూర్తం జరుపుకున్నఈ బయోపిక్.. దర్శకుడి మార్పు కారణంగా సెట్స్ పైకి వెళ్లడానికి మరికొంత సమయం పట్టనుంది. ఈలోగా బాలయ్య వినాయక్‌తో ఓ సినిమా మొదలుపెట్టనున్నాడు. మరోవైపు సెప్టెంబర్‌తో రామ్ చరణ్ సినిమాను బోయపాటి పూర్తి చేసి.. దసరా నుంచి బాలయ్య సినిమాను షురూ చేయనున్నాడట. 2019 ఎన్నికలకు ముందు.. బోయపాటి చిత్రాన్ని విడుదల చేయాలనే ఆలోచనలో బాలకృష్ణ ఉన్నట్టు సమాచారం.





Untitled Document
Advertisements