బాలకృష్ణ అంటే నాకు ఇష్టం : కేటీఆర్‌

     Written by : smtv Desk | Thu, May 24, 2018, 05:35 PM

బాలకృష్ణ అంటే నాకు ఇష్టం : కేటీఆర్‌

హైదరాబాద్‌, మే 24 : తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ నందమూరి బాలకృష్ణ తను ఎంతగానో ఇష్టపడే నటుడని అన్నారు. తారకరామారావు అని ఆయన తండ్రి పేరున్న తాను ఆ పేరు నిలబెట్టే పని చేస్తాను కానీ, చెడగొట్టే పని మాత్రం చేయనని అన్నారు. జూబ్లీహిల్స్‌లోని బసవతారకం కేన్సర్‌ ఆస్పత్రిలో బీఎంటీ యూనిట్‌ను గురువారం ఆయన ఆరంభించారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి ఛైర్మన్‌, మేనేజ్‌మెంట్‌ ట్రస్టీ నందమూరి బాలకృష్ణ పాల్గొన్నారు.

ఈసందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. క్యాన్సర్‌పై రాష్ట్ర ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రభుత్వ, ప్రయివేటు సంస్థలు కలిసి పని చేయాల్సి ఉందని అభిప్రాయపడ్డారు. సామాన్య ప్రజలకు అర్థమయ్యే రీతిలో చెప్పగలిగే వైద్యులు, సెలబ్రెటీలు ఇందులో భాగస్వామ్యులు కావాలని పిలుపునిచ్చారు. క్యాన్సర్‌ అని తెలియగానే...ఆ భయంతోనే సగం ప్రాణం పోతుందని..ఆ భయాన్ని పోగొట్టేందుకు...ఆధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయన్న విషయాన్ని విస్తృతంగా ప్రచారం చేయాల్సి ఉందని మంత్రి కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు.

'నాన్నగారి స్పూర్తితోనే సీఎం కేసీఆర్.. తన కొడుకుకి తారకరామారావు అని పేరు పెట్టారు' అని ఈ సందర్భంగా బాలకృష్ణ అన్నారు. తొలుత 40 బెడ్స్‌తో ప్రారంభించిన ఈ ఆస్పత్రిని అంచలంచలుగా విస్తరిస్తూ.. ప్రజలకు సేవలు అందిస్తున్నట్లు బాలయ్య వివరించారు. జీహెచ్‌ఎంసీకి ఆస్పత్రి చెల్లించాల్సిన రూ.6 కోట్లు ఆస్తి పన్నును రద్దు చేసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు చెప్పారు.





Untitled Document
Advertisements