"విజేత" ఫస్ట్ లుక్ రిలీజ్..

     Written by : smtv Desk | Sat, May 26, 2018, 04:03 PM


హైదరాబాద్, మే 26 : మెగాస్టార్‌ ఫ్యామిలీ నుంచి మరో హీరో వెండితెరకు పరిచయం కాబోతున్న విషయం తెలిసిందే. చిరు చిన్నల్లుడు కళ్యాణ్‌ దేవ్‌(శ్రీజ భర్త), ప్రముఖ చలన చిత్ర సంస్థ వారాహి ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి చిరు సినిమా 'విజేత' అనే టైటిల్ ను ఖరారు చేశారు. ఇటీవల టైటిల్‌ లోగోను రివీల్‌ చేస్తూ విడుదల చేసిన పోస్టర్‌ కూడా మెగా అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది.

తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. కళ్యాణ్ స్మైలీ లుక్ తో ఎంతగానో ఆకట్టుకున్నారు. రాకేష్‌ శశి దర‍్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను సాయి కొర్రపాటి నిర్మిస్తున్నారు. కళ్యాణ్ దేవ్ సరసన మాళవిక నాయర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాకు హర్షవర్ధన్‌ రామేశ్వర్‌ సంగీతమందిస్తున్నారు. జూలైలో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు రానుంది.





Untitled Document
Advertisements