ఒకాసాను వణికించిన భూకంపం..

     Written by : smtv Desk | Mon, Jun 18, 2018, 12:26 PM

 ఒకాసాను వణికించిన భూకంపం..

టోక్యో‌, జూన్ 18 : జపాన్‌లోని ఒకాసా నగరం భూకంపానికి చిగురుటాకులా వణికింది. భూకంపం కారణంగా ముగ్గురు మృతి చెందగా, 200 మంది వరకు గాయపడ్డట్లుగా సమాచారం. వెక్టర్న్ జపాన్‌లోని ఒకాసాతో పాటు పలు ప్రాంతాల్లో సోమవారం ఉదయం ఈ భూకంపం వచ్చింది. రిక్టర్‌ స్కేలుపై 5.9తీవ్రతతో ప్రకంపనలు వచ్చినట్లు జపాన్‌ భూభౌతిక శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రకంపనల తాకిడికి కొన్ని చోట్ల భవానాల అద్దాలతో పాటు నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి.

తాత్కాలికంగా బుల్లెట్‌ రైలు సేవలను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే సేవలు పునరుద్ధరిస్తామని వెల్లడించారు. భూకంప కేంద్రం ఉత్తర ఒకాసా ప్రాంతానికి 13 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైంది. సునామీ హెచ్చరికలు లేవు. భూకంప తీవ్రతకు ఓ స్విమ్మింగ్ పూల్ గోడ కూలిపోయింది. ఈ కారణంగానే 9 ఏళ్ల చిన్నారి మృతి చెందింది.





Untitled Document
Advertisements