జగమంతా 'యోగా' మాయం..

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 10:50 AM

జగమంతా 'యోగా' మాయం..

డెహ్రాడూన్, జూన్ 21 : భారత్ సహా ప్రపంచ దేశాల్లో ప్రజలంతా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. 2015 నుంచి ఏటా జూన్ 21 అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకొంటున్నాం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ ఉత్తరాఖండ్‌ రాజధాని డెహ్రాడూన్‌లో నిర్వహించిన యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. యోగా సాధనతో శాంతి, ఆరోగ్యం, సంతోషం ప్రాప్తిస్తాయని మోదీ అన్నారు. ప్రజలతో కలిసి ఆయన యోగా సాధన చేశారు. డెహ్రాడూన్‌ నుంచి డబ్లిన్‌ వరకు, షాంఘై నుంచి షికాగో వరకు అన్ని దేశాల ప్రజలు యోగాలో నిమగ్నమయ్యారని తెలిపారు. నేడు ప్రతి దేశం యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకున్నాయని మోదీ పేర్కొన్నారు.

యోగా డే సందర్భంగా ప్రముఖ సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ తన అద్భుతమైన సందేశాన్ని అందించారు. పుతిన్, ట్రంప్, మోదీ, కిమ్, జిన్‌పింగ్‌‌లు యోగా చేస్తున్నట్టుగా పూరీ బీచ్‌లో ఆయన సైకత శిల్పాన్ని రూపొందించారు. ప్రపంచంలోని శక్తివంతమైన నేతలు యోగా చేస్తున్నట్టుగా చిత్రీకరించడం ద్వారా యోగాసనాల ప్రాధాన్యాన్ని చాటి చెప్పే ప్రయత్నం చేశారు. కాగా ఈ రోజు యోగా దినోత్సవాన్ని పురష్కరించుకొని పలు రాష్ట్రాల్లో ముఖ్యమంత్రులు, ప్రముఖులు, ప్రజలు యోగా కార్యక్రమాల్లో పాల్గొన్నారు.





Untitled Document
Advertisements