'భైరవగీత' మోషన్ పోస్టర్ రిలీజ్..!!

     Written by : smtv Desk | Thu, Jun 21, 2018, 05:46 PM

'భైరవగీత' మోషన్ పోస్టర్ రిలీజ్..!!

హైదరాబాద్, జూన్ 21 : సంచలన సర్శకుడు రామ్ గోపాల్ వర్మ కన్నడ హీరో ధనుంజయతో 'భైరవగీత' అనే ప్రేమకథ చిత్రాన్ని నిర్మించనున్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషలలో తెరకెక్కనున్న ఈ చిత్రం ద్వారా సిద్ధార్థ అనే డెబ్యూ దర్శకుడ్ని వర్మ పరిచయం చేయబోతున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన మోషన్‌ పోస్టర్‌ను చిత్ర యూనిట్ కాసేపటి క్రితం రిలీజ్ చేశారు.

ప్రేమకథ చిత్రంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నామంటూ చెబుతూ.. 'దొరల పొగరు పరాకాష్టకి చేరినప్పుడు బానిసల ధైర్యం కూడా పరాకాష్టకి చేరుతుంది' అంటూ ఓ ట్యాగ్‌ లైన్‌ చూపించాడు. ఈ పోస్టర్ చూస్తుంటే.. ఇదేదో యాక్షన్ సినిమాను తలపించేలా ఉంది. వర్మ మార్క్ కనిపిస్తూ ఉంది. ఈ సినిమాను వర్మతో పాటు భాస్కర్ రాశి నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించి రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు. కాగా ఇటీవల నాగార్జునతో తెరకెక్కించిన 'ఆఫీసర్' సినిమా ఘోర పరాజయం పాలైన సంగతి తెలిసిందే.

Untitled Document
Advertisements