శ్రీవిష్ణు సినిమాకు నారా రోహిత్ క్లాప్..

     Written by : smtv Desk | Fri, Jun 22, 2018, 06:02 PM

శ్రీవిష్ణు సినిమాకు నారా రోహిత్ క్లాప్..

హైదరాబాద్, జూన్ 22 : 'నీది నాది ఒకేకథ' సినిమా ద్వారా మంచి హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు హీరో శ్రీవిష్ణు. ఈ చిత్ర విజయం తర్వాత ఆయనకు వరుస అవకాశాలు వస్తున్నట్లు తెలుస్తుంది. తాజాగా రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్స్, కృష్ణ విజయ్ ఎల్ ప్రొడక్షన్స్ బ్యానర్సపై 'శ్రీ ఓం సినిమా' సమర్పణలో ఓ చిత్రం చేయనున్నారు. కృష్ణ విజయ్ ఎల్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం నేడు అధికారికంగా ప్రారంభమైంది. ఈ చిత్రానికి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా.. నారా రోహిత్ క్లాప్ కొట్టారు.

అలాగే ఈ చిత్రానికి "తిప్పరా మీసం" అనే టైటిల్‌ అనుకుంటున్నారు. కాగా జూలైలో రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టి ఈ ఏడాది చివర్లో సినిమాను విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు దర్శకుడు పేర్కొన్నారు. ఈ సందర్భంగా హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ.. "విజయ్ తో వర్క్ చేయడం హ్యాపీగా ఉంది. కొన్ని ఏళ్లుగా మేము కలిసి పనిచేస్తున్నాము. ఈ సినిమా అందరికి నచ్చే సినిమా అవుతుందని నమ్ముతున్నా. చిత్ర యూనిట్ సభ్యులకు అభినందనలు తెలుపుతున్నా" అంటూ వెల్లడించారు.





Untitled Document
Advertisements