అక్కడ 'నాచియార్'.. ఇక్కడ 'ఝాన్సీ'..

     Written by : smtv Desk | Sat, Jul 14, 2018, 06:28 PM

అక్కడ 'నాచియార్'.. ఇక్కడ 'ఝాన్సీ'..

హైదరాబాద్, జూలై 14 : జ్యోతిక ప్రధాన పాత్రలో దర్శకుడు బాల తెర‌కెక్కించిన సినిమా 'నాచియార్'. తమిళంలో విడుదలైన ఈ సినిమా ఘన విజయం అందుకుంది. బాలా దర్శక నిర్మాతగా వ్యవహరించిన ఈ సినిమా అక్కడ భారీ వసూళ్లను రాబట్టింది. ఈ సినిమాలో పోలీస్ అధికారిణిగా జ్యోతిక ప్రదర్శించిన నటనకు అభిమానుల నుంచి అభినందనలు దక్కాయి. అక్కడి అగ్రనటీనటులు సైతం ఆమె నటన పట్ల ప్రశంసలు కురిపించారు.

ఈ నేపథ్యంలో తమిళ ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈ సినిమాను తెలుగులో డి.వి. సినీ క్రియేషన్స్ బ్యానర్ రిలీజ్ చేయనున్నారు. తెలుగులో 'ఝాన్సీ' పేరుతో విడుదల చేస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి త్వరలోనే టీజర్‌ను రిలీజ్ చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు. జీవీ ప్రకాశ్ కుమార్ ముఖ్యమైన పాత్రను పోషిస్తున్న ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూర్చారు. చాలాకాలం తర్వాత జ్యోతిక కథానాయికగా తెలుగులో విడుదలౌతున్న ఈ సినిమాకు ప్రేక్షకులలో భారీ అంచనాలే నెలకొన్నాయి.





Untitled Document
Advertisements