శ్రీదేవి పాత్రలో రకుల్..!!

     Written by : smtv Desk | Wed, Jul 18, 2018, 06:48 PM

శ్రీదేవి పాత్రలో రకుల్..!!

హైదరాబాద్, జూలై 18 : మాజీ ముఖ్యమంత్రి, దివంగత నటుడు నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం 'ఎన్టీఆర్'‌. ఈ సినిమాకు క్రిష్‌ దర్శకత్వం వహిస్తుండగా.. ఎన్‌బీకే ఫిల్మ్స్‌ పతాకంపై బాలకృష్ణ, సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. అయితే ఈ చిత్ర౦లో ఒక ప్రత్యేకమైన పాట కోసం దర్శకుడు క్రిష్.. రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ, హిందీ సినిమాలతో బిజీగా ఉన్న రకుల్.. ఈ ప్రాజెక్టుపై క్రేజ్ కారణంగా ఈ ప్రత్యేకమైన పాటలో మెరవడానికి అంగీకరించిందని అంటున్నారు.

నిజానికి రకుల్ ను తీసుకుంది ప్రత్యేకమైన పాట కోసం కాదంట. సీనియర్ హీరోయిన్ 'శ్రీదేవి' పాత్ర కోసం రకుల్ ను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. ఎన్టీఆర్.. శ్రీదేవి కలిసి చాలా సినిమాల్లో నటించారు. వాటిలో ఎన్నో సూపర్ హిట్స్ వున్నాయి. అందువలన ఈ సినిమాలో శ్రీదేవి పాత్ర ఉంటుందట. అయితే ఈ పాత్ర కోసం రకుల్ ను సంప్రదించడంతో ఆమె ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. కాగా ఈ చిత్రంలో మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, నాగ చైతన్య, మురళీ శర్మ, రాజశేఖర్, కీర్తి సురేష్ నటిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. వీటన్నింటికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

Untitled Document
Advertisements