క్షీణించిన హార్దిక్ పటేల్ ఆరోగ్యం

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 03:07 PM

క్షీణించిన హార్దిక్ పటేల్ ఆరోగ్యం

పటీదార్లకు రిజర్వేషన్లు, రైతుల రుణమాఫీ తదితర డిమాండ్లపై నిరవధిక నిరాహార దీక్ష చేపట్టిన పటీదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ ఆరోగ్యం విషమించింది. దీంతో ఆయనను పటీదార్‌ అనామత్‌ ఆందోళన్‌ సమితి (పాస్‌) నేతలు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

గురువారం నుంచి హార్దిక్ మంచినీరు కూడాతీసుకోవడం మానేశారు. శ్వాససంబంధ సమస్యలు తలెత్తడంతో శుక్రవారం ఆయనను సోలా సివిల్ దవాఖానకు తరలించారు. ముగ్గురు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. రెండు వారాల్లో ఆయన 20 కిలోల బరువు తగ్గారు.హార్దిక్‌కు మద్దతుగా కాంగ్రెస్ శ్రేణులు కూడా శుక్రవారం ఒక్కరోజు దీక్షకు దిగాయి. మరోవైపు హార్దిక్ దీక్షను ఏమాత్రం పట్టించుకోని గుజరాత్ ప్రభుత్వం.. ఆరు ఇతర పాటిదార్ సంఘాలను చర్చలకు ఆహ్వానించింది.

గుజరాత్‌ ప్రజలు, రైతుల సమస్యల పరిష్కారంపై బీజేపీ ప్రభుత్వం ఆసక్తి చూపడంలేదని పాస్‌ కన్వీనర్‌ మనోజ్‌ పనారా ఆరోపించారు.





Untitled Document
Advertisements