పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్‌

     Written by : smtv Desk | Sun, Sep 09, 2018, 03:14 PM

పోలీసుల కస్టడీలో యోగేంద్ర యాదవ్‌

సేలం–చెన్నై 8 వరుసల ఎక్స్‌ప్రెస్‌ వే నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావం తెలిపేందుకు వెళుతున్న స్వరాజ్‌ అభియాన్‌ నేత యోగేంద్ర యాదవ్‌ను తమిళనాడు పోలీసులు శనివారం అదుపులోకి తీసుకున్నారునిరసన తెలుపుతున్న రైతులతో పాటు యాదవ్‌ను నిర్బంధంలోకి తీసుకున్న పోలీసులు అక్కడ్నించి వేరే చోటికి తరలించారు. దీనిపై యాదవ్ మాట్లాడుతూ, రైతులు నిజంగానే తమ భూములు ఇవ్వాలనుకుంటున్నారా అనే విషయాన్ని వారితోనే మాట్లాడి తెలుసుకునేందుకు తానిక్కడకు వచ్చానని, అయితే నిమిషాల్లోనే తమను నిర్బంధంలోకి తీసుకున్నారని చెప్పారు

రూ.10 వేల కోట్లతో నిర్మించనున్న చెన్నై-సేలం 8 లేన్ల ఎక్స్‌ప్రెస్ రహదారిని స్థానిక రైతులు వ్యతిరేకిస్తూ కొన్నిరోజులుగా ఆందోళన చేస్తున్నా రు. ఈ రహదారి నిర్మాణం పేరుతో తమ భూములను బలవంతంగా లాక్కుంటున్నారని, సేకరణ పేరుతో బతకనివ్వడం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. వారితో కలిసి ఆందోళన చేపట్టేందుకు తమిళనాడుకు వచ్చిన యోగేంద్రను తిరువణ్ణామలై వద్ద పోలీసులు అడ్డుకున్నారు.





Untitled Document
Advertisements