సమంత ఘాటైన రిప్లై

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 11:08 AM

సమంత ఘాటైన రిప్లై

హీరోయిన్ గా సమంత సూపర్ టాలెంట్ చాటేయగా అక్కినేని కోడలిగా మారాక కొత్త టర్న్ తీసుకుంది. సినిమాల సెలక్షన్స్ విషయంలో కాస్త ఆచి తూచి అడుగులేస్తున్న సమంత ట్రోలింగ్స్ కు ఈసారి గట్టిగా సమాధానం చెప్పింది అలాంటిలాంటి సమాధానం కాదు ఏకంగా మిడిల్ ఫింగర్ చూపించేసింది.

ఎప్పుడు ఫ్యాన్స్ తో సరదాగా ఉండే సమంత ఇలా ఎందుకు చేసింది అంటే అక్కినేని కోడలిగా మారాక సమంత కొన్నిటిలో మారినట్టు కనిపించినా కొన్నిటిలో మారడం లేదని ఫ్యాన్స్ ఆందోళన.

తాజాగా హాలీడేలో ఉన్న ఫోటోలను షేర్ చేసింది సమంత. వాటిలోని ఒక ఫోటోలో బీచ్ డ్రెస్ వేసుకుని కనిపించింది. వాటిని చూసిన కొందరు అతిగా స్పందిస్తూ మీరిప్పుడు అక్కినేని కోడలు, ఇలాంటి డ్రెస్ ఏంటి అంటూ ఉచిత సలహాలిచ్చే ప్రయత్నం చేయగా ఇంకొందరు అభిమానులు డ్రెస్ అనేది ఆమె వ్యక్తిగత వ్యవహారం. ఆమెకు ఇష్టం వచ్చినట్లు ఉంటుంది అంటూ సపోర్ట్ చేశారు. సలహాలు మరీ శృతిమించడంతో స్పందించిన సమంత తన ఇన్స్టాగ్రమ్ స్టోరీలో పెళ్లి తరవాత నేనిలా ఉండాలి అలా ఉండాలి అని చెప్పే వాళ్లందరికీ ఇదే సమాధానం అంటూ మిడిల్ ఫింగర్ ఉన్న బొమ్మను పోస్ట్ చేసి థాంక్యూ చెబుతూ ఘాటైన రిప్లై ఇచ్చింది

Untitled Document
Advertisements