చిరంజీవి తో సై అంటున్న తమన్నా

     Written by : smtv Desk | Fri, Sep 28, 2018, 01:38 PM

చిరంజీవి తో సై అంటున్న తమన్నా

మెగస్టార్ చిరంజీవి సైరా సినిమా తర్వాత చేస్తున్న కొరటాల శివ సినిమా కాస్టింగ్ సెలక్షన్ ప్రాసెస్ మొదలైంది. రైటర్ నుండి దర్శకుడిగా మారిన కొరటాల శివ మిర్చి నుండి భరత్ అనే నేను వరకు సక్సెస్ బాటలో నడుస్తున్నాడు. త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో మూవీ మొదలు పెట్టనున్నాడట. డిసెంబర్ లో ఈ సినిమా ముహుర్తం పెడతారని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా మిల్కీ బ్యూటీ తమన్నాని సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

ఈమధ్య కెరియర్ దాదాపు ముగించేసిందనిపించిన తమన్నా మళ్లీ ఇప్పుడు వరుస అవకాశాలను అందుకుంటుంది. ఇప్పటికే వెంకటేష్ సరసన ఎఫ్-2 సినిమాలో నటిస్తున్న అమ్మడు దానితో పాటుగా బాలీవుడ్ క్వీన్ రీమేక్ గా వస్తున్న దటీజ్ మహాలక్ష్మి సినిమాతో కూడా రాబోతుంది. చిరుతో సినిమా తర్వాతే కాజల్ మళ్లీ సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మరి తమన్నా కూడా చిరుతో జోడీ కట్టి ఇమేజ్ డబుల్ చేసుకుంటుందేమో చూడాలి.

సీనియర్ హీరోలకు హీరోయిన్ కష్టాలు తెలిసిందే. ముఖ్యంగా చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరోల సరసన నటించాలంటే హీరోయిన్స్ వెనుకడుగు వేస్తున్నారు. తమన్నా ఓకే చెప్పడంతో కొరటాల శివ, చిరు ప్రాజెక్ట్ పై మరింత క్రేజ్ పెరిగింది.

Untitled Document
Advertisements