పొత్తులలో సీట్ల సర్దుబాట్లు తప్పనిసరే కానీ

     Written by : smtv Desk | Sat, Sep 29, 2018, 12:39 PM

పొత్తులలో సీట్ల సర్దుబాట్లు తప్పనిసరే కానీ

కాంగ్రెస్‌-టిడిపి-సిపిఐ-తెలంగాణా జనసమితి పొత్తులలో భాగంగా సీట్ల సర్దుబాట్లపై ఆ నాలుగు పార్టీల మద్య ఎడతెగని చర్యలు సాగాయి. ఆ తరువాత టి-పిసిసి అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి డిల్లీ వెళ్ళి కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్ గాంధీకి పరిస్థితులు వివరించారు. కాంగ్రెస్‌ పార్టీకి బాగా బలమైన అభ్యర్ధులున్న స్థానాలను మిత్రపక్షలకు వాదులుకోవద్దని రాహుల్ గాంధీ సూచించారు. టిడిపికి 10, తెలంగాణా జనసమితి-3, సిపిఐ-2 సీట్లు కేటాయించాలని నిర్ణయించుకొన్నట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. వాటిపై తెలంగాణా జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ స్పందిస్తూ, “రాజకీయ పార్టీలు ఒకదానితో మరొకటి పొత్తులు పెట్టుకొన్నప్పుడు పరస్పరం సమానమని భావిస్తూ గౌరవించుకోవాలి. పొత్తులలో సీట్ల సర్దుబాట్లు తప్పనిసరే కానీ ఆ విషయం అంతర్గతంగా మాట్లాడుకొని తేల్చుకోవాలి తప్ప మీడియా ద్వారా లీకులు ఇవ్వడం సరికాదు. సీట్ల సర్దుబాటులో పట్టువిడుపులు అవసరమే కానీ వాటి వలన మా పార్టీకి నష్టం కలగకూడదని కోరుకొంటున్నాము,” అని అన్నారు.





Untitled Document
Advertisements