బిగ్ బాస్ ఫైనల్ విన్నర్

     Written by : smtv Desk | Mon, Oct 01, 2018, 10:08 AM

బిగ్ బాస్ ఫైనల్ విన్నర్ గా కౌశల్ టైటిల్ అందుకున్నాడు. నాని హోస్ట్ గా 113 రోజుల నుండి నడుస్తున్న బిగ్ బాస్ రియాలిటీ షో ఫైనల్ విన్నర్ గా కౌశల్ తన సత్తా చాటాడు. ఈ 113 రోజుల్లో 11 సార్లు నామినేట్ అయిన కౌశల్ తన ఫ్యాన్స్ అదే కౌశల్ ఆర్మీ సపోర్ట్ తో ప్రతివారం ఎలిమినేషన్స్ నుండి బయట పడుతూ వచ్చాడు.

ఇక టాప్ 5లో తనీష్, గీతా మాధురి, దీప్తి, సామ్రాట్ లతో పాటుగా నిలిచిన కౌశల్ టాప్ 2 లో గీతా మాధురిని ఓడించి టైటిల్ విన్నర్ అవడం జరిగింది. ఇక ఈ ఫైనల్ ఎపిసోడ్ కు స్పెషల్ గెస్ట్ గా విక్టరీ వెంకటేష్ అటెండ్ అవడం సర్ ప్రైజింగ్ గా అనిపించింది. టైటిల్ విన్నర్ అయిన కౌశల్ కు 50 లక్షల క్యాష్ తో పాటుగా బిగ్ బాస్ అవార్డ్ అందించారు.

Untitled Document
Advertisements