విజయ్ దేవరకొండ రూటే సెపరేటు !!

     Written by : smtv Desk | Tue, Oct 02, 2018, 12:40 PM

విజయ్ దేవరకొండ రూటే సెపరేటు !!

హైదరాబాద్ , అక్టోబర్ 02: ఈరోజుల్లో ముల్టీస్టారర్ సినిమా కి మంచి జోష్ నడుస్తున్న విషయం తెలిసినదే , ఈ తరహాలో విజయ్ దేవరకొండ ముల్టీస్టారర్ మూవీస్ పై మక్కువచూపినట్టు తెలుస్తుంది . నోటా తో తమిళ వర్గంలో విజయ్ తెరెంగేట్రం చేయబోతున్నాడు.

ఈ రెండు సినిమాలతో తమిళ దర్శకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు . ఈ నేపథ్యంలో విజయ దేవరకొండ మరియు సూర్య కలసి ముల్టీస్టార్ర్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు దర్శకుడు ఎవరు.. సినిమాను ఎవరు నిర్మిస్తారు అన్న విషయాన్ని వెళ్లడించలేదు కాని సూర్యతో మల్టీస్టారర్ సినిమా ఉంటుందని చూచాయగా చెప్పాడు విజయ్ దేవరకొండ. శుక్రవారం రిలీజ్ కాబోతున్న నోటా ప్రమోషన్స్ లో భాగంగా విజయ్ దేవరకొండ ఈ మల్టీస్టారర్ విశేషాలను షేర్ చేసుకున్నాడు.

సూర్య, విజయ్ ఇద్దరు ఎవరి టాలెంట్ వారు చూపించి ఆడియెన్స్ లో మెప్పు పొందిన వారు. మరి అలాంటి టాలెంటెడ్ ఆర్టిస్టులు ఇద్దరు కలిస్ చేసే సినిమా ఎలా ఉండబోతుందో చూడాలి. ఈ సినిమా బైలింగ్వల్ గా తీస్తారని తెలుస్తుంది.

Untitled Document
Advertisements