టీజేఎస్‌కు 11 సీట్లు

     Written by : smtv Desk | Tue, Nov 06, 2018, 07:57 PM

ప్రపంచ యుద్ధానికి అయినా ముగింపు పలకొచ్చుగాని మహాకూటమిలో సీట్ల పంచాయితీ తెంచడం మాత్రం సాధ్యం కాదు.. సోషల్ మీడియాలో వచ్చిన ఓ కామెంట్ ఇది. కూటమి తీరు అందుకు తగ్గట్టే ఉంది మంది. గట్టిగా ఎన్నికలకు నెల వ్యవధి కూడా లేకున్నా విపక్షాలు మంకుపట్టుతో సీట్ల వాటాలను ఇంకా తేల్చుకోవడం లేదు.

15 సీట్లు కావాలని పట్టుబడుతున్న టీజేఎస్‌ను కూటమి సారథి కాంగ్రెస్ ఎట్టకేలకు 11 సీట్లకు ఒప్పించినట్లు తెలుస్తోంది. అయితే అన్నేసి సీట్లను అప్పనంగా ఇవ్వలేమంటూ ఓ మెలిక కూడా పెట్టింది. ఆ 11 సీట్లలో కొన్ని చోట్ల హస్తం అభ్యర్థులు ‘స్నేహపూర్వక’ పోటీ చేస్తారని లింకు పెట్టింది. ఆయా సీట్లను కోరుతున్న తమ నేతలకు మొండిచేయి చూపలేమని, వారి తృప్తి కోసం ‘స్నేహంగా’ బరిలోకి దించుతామని పేర్కొంది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికి వచ్చినట్లయింది.

ఈ షరతుకు తాము ఒప్పుకునే ప్రసక్తే లేతని టీజేఎస్ నేత కోదండరాం స్పష్టం చేశారని, దీంతో మరో దఫా కూటమి నేతలు చర్చించుకుని రేపుగాని, ఎల్లుండిగాని పంచాయతీ తేలుస్తారని అంటున్నారు. కోదండరాం పార్టీకి నల్గొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల్లో ఒక్క సీటూ కేటాయించలేదని సమాచారం.

Untitled Document
Advertisements