'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' శాటిలైట్ వ్యూ

     Written by : smtv Desk | Sat, Nov 17, 2018, 05:12 PM

'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' శాటిలైట్ వ్యూ

గుజరాత్, నవంబర్ 17: భారత ఐక్యతను చాటి చెప్పడానికి ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ ఉక్కుమనిషి 'సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్' విగ్రహాన్ని 182 మీటర్ల పొడుగుతో నిర్మించిన విషయం తెలిసిందే. దీనికి 'స్టాచ్యు ఆఫ్ యూనిటీ' అని పేరు కూడా పెట్టారు. అయితే అందులో ఏర్పాటు చేసిన లిఫ్టు ద్వారా పైకెళ్లి నర్మద చుట్టుపక్కల అందాలను తిలకిస్తున్నారు. ఇదంతా భూమిపై సాగుతున్న ముచ్చట. డ్రోన్లతో కూడా ఈ విగ్రహాన్ని చూపిస్తున్నారు.

అయితే ఇదంతా భూమిపై, భూమికి కొన్ని వందల మీటర్లపై ఎత్తులో సాగే ముచ్చట. మరి ప్రపంచంలో అత్యంత ఎత్తయిన 182 మీటర్ల పటేల్ విగ్రహం అంతరిక్షం నుంచి చూస్తే ఎలా ఉంటుంది? ఇది ఈ చిత్రంలా ఉంటుంది. ఈ చిత్రాన్ని 15న విడుదల చేశారు. స్కైలాబ్ ఆధ్వర్యంలోని అమెరికన్‌ కాన్‌స్టిలేషన్‌ ఆఫ్ శాటిలైట్స్ దీన్ని మీడియాకు అందించింది. ఐక్యతా విగ్రహం అగ్ర భాగం, పక్కనే నర్మదా నది ప్రవాహం అందులో కనిపిస్తున్నాయి.





Untitled Document
Advertisements