ముచ్చటగా మూడోసారి

     Written by : smtv Desk | Sun, Nov 18, 2018, 05:28 PM

ముచ్చటగా మూడోసారి

హైదరాబాద్, నవంబర్ 18: వరుస విజయాలతో దూసుకుపోతున్న నానికి ఈ ఏడాది వొచ్చిన కృష్ణార్జున యుద్ధం, దేవదాస్ రెండు చిత్రాలు కాస్త నిరాశపరిచాయి. ప్రస్తుతం నాని జెర్సీ సినిమా చేస్తున్నాడు. గౌతం తిన్ననూరి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో నాని క్రికెటర్ గా కనిపించనున్నాడని తెలుస్తుంది.

ఈ సినిమా తర్వాత నాని మరోసారి మోహనకృష్ణ ఇంద్రగంటితో సినిమా చేస్తాడని తెలుస్తుంది. అష్టాచమ్మతో నానిని హీరో చేసింది మోహనకృష్ణ ఇంద్రగంటినే. ఈ కాంబినేషన్ లో జెంటిల్మన్ అంటూ మరో హిట్ కూడా కొట్టారు. ముచ్చటగా మూడవసారి నాని, మోహనకృష్ణ ఇంద్రగంటి కలిసి పనిచేస్తారట. ఈ సినిమాలో నాని కాకుండా మరో హీరో కూడా ఉంటాడని తెలుస్తుంది. దేవదాస్ ఫెయిల్ అయినా నాని మళ్లీ మల్టీస్టారర్ పై ఇంట్రెస్ట్ చూపడం ఆశ్చర్యంగా ఉంది.





Untitled Document
Advertisements