బాలసాయిబాబా ఇకలేరు

     Written by : smtv Desk | Tue, Nov 27, 2018, 01:51 PM

బాలసాయిబాబా ఇకలేరు

కర్నూలు, నవంబర్ 27: కర్నూలుకు చెందిన బాల సాయిబాబా మంగళవారం తెల్లవారు జామున గుండెపోటుతో మృతి చెందారు. ఆయన కొన్ని రోజుల క్రితం హైదరాబాద్‌ దోమల్ గూడలో ఉన్న తన ఆశ్రమానికి వచ్చి ఉంటున్నారు. సోమవారం రాత్రి గుండెపోటు రావడంతో అనుచరులు ఆయనను బంజారాహిల్స్ లోని విరించి ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ఆయనను కాపాడేందుకు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో బాబా ఈరోజు తెల్లవారుజామున తుది శ్వాస విడిచారు.

Untitled Document
Advertisements