'తందానే తందానే' అంటున్న రామ్ చరణ్

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 05:58 PM

'తందానే తందానే' అంటున్న రామ్ చరణ్

హైదరాబాద్, డిసెంబర్ 01: మెగా పవర్ స్టార్ రాం చరణ్, బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న సినిమా వినయ విధేయ రామ. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కియరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది. 2019 సంక్రాంతి బరిలో దిగుతున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఇక ఈ సినిమాకు సంబందించిన ఫస్ట్ సాంగ్ డిసెంబర్ 3న రిలీజ్ కాబోతుంది. 'తందానే తందానే' అంటూ ఫ్యామిలీ సాంగ్ తో వస్తున్న ఈ సాంగ్ తో చరణ్ వి.వి.ఆర్ ప్రమోషన్స్ మొదలుపెట్టనున్నాడు.

రంగస్థలం తర్వాత చరణ్ చేస్తున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. సరైనోడుతో మెగా హీరోలకు మెమరబుల్ హిట్ ఇచ్చిన బోయపాటి శ్రీను చరణ్ తో చేస్తున్న వినయ విధేయ రామతో మరోసారి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. సినిమాలో కోలీవుడ్ హీరో ప్రశాంత్, ఆర్యన్ రాజేష్ నటిస్తున్నారు. విలన్ గా వివేక్ ఓబేరాయ్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలుస్తాడని తెలుస్తుంది.

Untitled Document
Advertisements