2.ఓ బ్లాక్ బస్టర్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు

     Written by : smtv Desk | Sat, Dec 01, 2018, 07:11 PM

 2.ఓ బ్లాక్  బస్టర్ ఎంజాయ్ చేస్తున్న దిల్ రాజు

హైదరాబాద్, డిసెంబర్ 01: రోబో సీక్వల్ గా శంకర్, రజిని కాంబినేషన్ లో వచ్చిన భారీ బడ్జెట్ మూవీ 2.ఓ. గురువారం రిలీజైన ఈ సినిమా తెలుగులో కూడా మంచి టాక్ తో దూసుకెళ్తుంది. తెలుగులో ఈ సినిమాను రిలీజ్ చేసిన ఎన్వీ ప్రసాద్, దిల్ రాజు లు ఈ సినిమా విజయాన్ని ఎంజాయ్ చేస్తున్నారు. సినిమా అన్ని చోట్ల విజయవంతంగా ప్రదర్శించబడుతుందని అన్నారు. దిల్ రాజు అయితే సంక్రాంతి వరకు 2.ఓ కి తిరుగులేదని అన్నారు. చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ సినిమా చూస్తున్నారని.. ఫ్యామిలీ ఆడియెన్స్ కూడా సినిమాను ఎంజాయ్ చేస్తున్నారని అన్నారు దిల్ రాజు.

తెలుగులో 2.ఓ సినిమా 70 కోట్ల బిజినెస్ చేసింది. ఇక ఈ సినిమా తెలుగులో మొదటి రోజు 12 కోట్లు షేర్ రాబట్టగా రెండు రోజులు కలిపి 18.56 కోట్లు రాబట్టింది. సినిమాకు దిల్ రాజు చెప్పిన జోస్యం ఏమాత్రం ఫలిస్తుందో చూడాలి. రజినితో పాటుగా అక్షయ్ కుమార్ నటనకు మంచి రెస్పాన్స్ వచ్చింది. పక్షి రాజుగా అక్షయ్ కుమార్ అదరగొట్టేశాడు.

Untitled Document
Advertisements