పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్..!

     Written by : smtv Desk | Tue, Dec 04, 2018, 03:28 PM

 పవన్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన జగన్..!

శ్రీకాకుళం, డిసెంబర్ 4: శ్రీకాకుళం జిల్లా రాజాంలో నిర్వహించిన రోడ్ షో లో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ నాలుగేళ్ల కోసారి భార్యను మార్చే పవన్ కల్యాణ్.. ‘పెళ్లి అనే పవిత్ర బంధాన్ని హస్యాస్పదం చేశాడని, కారుమార్చినట్లు భార్యలను మార్చడం మగతనమా? అని సంచలన వ్యాఖ్యలు చేశారు.


మాజీ భార్య రేణూ దేశాయ్ అన్న మాటలను పవన్ గుర్తుతెచ్చుకోవాలని సూచించారు, పవన్ కల్యాణ్ తీరుపై మాట్లాడిన రేణూదేశాయ్ పై ఆయన అభిమానులు తీవ్ర విమర్శలు చేస్తే, పవన్ మౌనంగా ఉండటమే మగతనమా? వైఎస్ఆర్ పాలనపై విమర్శలు చేస్తున్న పవన్ కు వైఎస్ పాలన గురించి ఏం తెలుసని ప్రశ్నించారు. చంద్రబాబుతో నాలుగున్నర సంవత్సరాలు కాపురం చేసిన పవన్, చంద్రబాబు చేసిన, అవినీతిలో భాగస్వామి కాదా? అని ప్రశ్నించారు.

Untitled Document
Advertisements