తాజ్ మహల్ టిక్కెట్ చార్జీలను భారీగా పెంచారు

     Written by : smtv Desk | Mon, Dec 10, 2018, 01:40 PM

తాజ్ మహల్ టిక్కెట్ చార్జీలను భారీగా పెంచారు

ఢిల్లీ, డిసెంబర్ 10: ప్రపంచంలోనే అద్భుత పాలరాతి కట్టడం… ప్రపంచ వింతల్లో ఒకటైన తాజ్ మహల్‌ను వీక్షించాలనుకునేవారు ఇకపై ఎంట్రీ టికెట్ కోసం భారీ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. తాజ్ మహల్ టిక్కెట్ చార్జీలను భారీగా పెంచారు. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా చీఫ్ ఆర్కియాలజిస్ట్ వసంత్ స్వర్ణాకర్ పెరిగిన ధరల వివరాలను వెల్లడించారు.

పెరిగిన ధరలు ఈరోజు నుంచే అమల్లోకి వచ్చాయి. దేశీయ టూరిస్టులకు ఇప్పటి వరకు ఎంట్రీ టికెట్ ధర రూ.50గా ఉండగా ఈరోజు నుంచి రూ.250 చెల్లించాలి. విదేశీ టూరిస్టుల టికెట్ ధర రూ.1,300 లకు పెరిగింది. సార్క్ దేశాల నుంచి వచ్చే టూరిస్టుల టికెట్ ధర రూ.540 నుంచి రూ.740కి పెరిగింది. రూ.50 టికెట్ తీసుకున్న వారిని తాజ్ మహల్ ప్రధాన ప్రాంతం వద్దకు అనుమతించమని… తాజ్‌ వెనుకవైపు ఉన్న యమునా నది ఫ్రంట్ నుంచి వీక్షించేందుకు మాత్రమే అనుమతిస్తామని చెప్పారు.





Untitled Document
Advertisements