ఈ నెల 16న ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం

     Written by : smtv Desk | Tue, Jan 08, 2019, 06:04 PM

ఈ నెల 16న ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం

హైదరాబాద్, జనవరి 8: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యే ప్రమాణ స్వీకారం ఎప్పుడనేది చెప్పకుండానే అసెంబ్లీ ప్రోటెం స్పీకర్ గా ఎంఐఎం పార్టీకి చెందిన ముంతాజ్ అహ్మద్ ఖాన్ ను ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ముంతాజ్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమిస్తూ అసెంబ్లీ సచివాలయం తాజాగా నోటిఫికేషన్ ను విడుదల చేసింది. దాని ప్రకారం ఈ నెల 16 న తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ముంతాజ్ అహ్మద్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఎంఐఎం పార్టీలో రెండు దశాబ్ధాలుగా క్రియాశీలకంగా పనిచేస్తోన్న ముంతాజ్ అహ్మద్..1994 నుంచి గత ఎన్నికల వరకు యాకుత్‌పురా నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2018 ఎన్నికల్లో ఆయన చార్మినార్ నుంచి గెలుపొందారు. తమపార్టీకి చెందిన ఎమ్మెల్యేలను ప్రొటెం స్పీకర్‌గా ఎంపిక చేసినందుకు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ.. ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపిన సంగతి తెలిసిందే.





Untitled Document
Advertisements